ETV Bharat / sitara

వివాహబంధంలో అడుగుపెట్టిన 'సాహో' భామ - ఎవ్లిన్​ శర్మ​ సాహో

బాలీవుడ్​ నటి ఎవ్లిన్​ శర్మ​(Evelyn Sharma) పెళ్లి పీటలెక్కింది. ఆస్ట్రేలియాకు చెందిన డెంటల్​ డాక్టర్​ తుషాన్​ భిండి(Tushaan Bhindi)ని ప్రేమించి గతనెలలో వివాహమాడింది. ఆ పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఎవ్లిన్​.. తన​ ఇన్​స్టాగ్రామ్​లో పంచుకుంది.

Yeh Jawaani Hai Deewani star Evelyn Sharma ties the knot with Tushaan Bhindi
వివాహబంధంలో అడుగుపెట్టిన 'సాహో' భామ
author img

By

Published : Jun 7, 2021, 12:31 PM IST

'హే జవాని హి దివాని' ఫేమ్​ ఎవ్లిన్​​ శర్మ(Evelyn Sharma) పెళ్లి పీటలెక్కింది. ఆస్ట్రేలియాకు చెందిన డెంటల్​ డాక్టర్​ తుషాన్​ భిండి(Tushaan Bhindi)ని మే 15న వివాహమాడినట్లు ఆమె సోమవారం వెల్లడించింది. వివాహానికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేయగా.. పలువురు అభిమానులు ఎవ్లిన్​కు శుభాకాంక్షలు తెలిపారు.

అయితే 2019లోనే వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. 'ఫ్రమ్​ సిడ్నీ విత్​ లవ్'(From Sydney with Love) అనే చిత్రంతో ఎవ్లిన్​ శర్మ బాలీవుడ్​లో అడుగుపెట్టింది. రణ్​బీర్​ కపూర్​ నటించిన ​'హే జవాని హి దివాని'(hey jawani he diwani) చిత్రంతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రభాస్​ హీరోగా తెరకెక్కిన 'సాహో'(Sahoo) చిత్రంతో టాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఎవ్లిన్​ శర్మ​ ప్రస్తుతం 'ఎక్స్​ రే: ది ఇన్నర్​ ఇమేజ్​' సినిమాలో నటిస్తోంది.

ఇదీ చూడండి: 'సాహో' నటి​కి పెళ్లి కుదిరింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.