సామాజిక మాధ్యమాల్లో తన ఖాతాలను వాస్తవానికి దగ్గరగా ఉంచుతుంది ప్రముఖ నటి, మోడల్ యామీ గౌతమ్ (Yami Gautam News). ఫిల్మ్‌మేకర్ ఆదిత్య ధర్‌తో తన వివాహాన్ని కూడా చాలా సింపుల్‌గా జరుపుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎడిట్ చేయని ఫొటోలు పెట్టి సాహసమే చేసింది. అంతేకాక తనకు కెరటోసిస్ పైలేరిస్ అనే వ్యాధి(Yami Gautam Skin) కూడా ఉందని తెలిపింది.
"నేను ఇటీవలే ఓ ఫొటో షూట్లో (Yami Gautam Latest Photoshoot) పాల్గొన్నా. ఆ ఫొటోలు.. నా చర్మ వ్యాధి కెరటోసిస్ పైలేరిస్ను దాచడానికేనని పోస్ట్ ప్రొడక్షన్‌కు(సాధారణంగా జరిగే ప్రక్రియే) వెళ్లేముందు నాకొకటి అనిపించింది. 'హే యామీ.. ఈ వాస్తవాన్ని ఎందుకు స్వీకరించకూడదు. దానిని అలాగే అంగీకరించాలి. మరేం పర్వాలేదు' అని నాకు నేను అనుకున్నా."
- యామీ గౌతమ్, నటి
ఈ వ్యాధి గురించి తన పోస్ట్‌లోనే వివరించింది యామీ (Yami Gautam Latest News). "కెరటోసిస్ పైలేరిస్ సోకితే చర్మంపై చిన్నపాటి దద్దుర్లు వస్తాయి. అయితే అవి మీ ఆలోచనలు, మీ పక్కింటి ఆంటీలు అనుకునేంత అసహ్యంగా అయితే ఉండవు. టీనేజీలో ఉన్నప్పుడు నాకీ వ్యాధి సోకింది. దానికి ఇప్పటికీ చికిత్స లేదు" అని యామీ రాసుకొచ్చింది.
"చాలా ఏళ్లుగా ఈ వ్యాధితో పోరాడుతూ వస్తున్నా. ఇప్పుడు నా భయాలు, ఆందోళనలను వీడాలని నిర్ణయించుకున్నా. నాలోని లోపాలను మనస్ఫూర్తిగా స్వీకరించి, ప్రేమించడానికి కావాల్సిన ధైర్యాన్ని కూడగట్టుకున్నాను. ఈ నిజాన్ని మీతో పంచుకునే ధైర్యం కూడా సాధించా. ఇక నేను ఎంతమాత్రం నా దద్దుర్లను దాచాలని, కళ్ల కింది భాగాన్ని మృదువుగా చేయాలని, నడుమును మరి కొంత షేపింగ్ అప్ చేయాలని గానీ అనుకోవడం లేదు. అయినా నేను చాలా అందంగా ఉన్నాననే భావన కలుగుతోంది."
- యామీ గౌతమ్, నటి
ఈ పోస్ట్ పట్ల అభిమానులు యామీని(Yami Gautam News) ఎంతగానో కొనియాడుతున్నారు. అందం ప్రమాణాలను పునర్నిర్వచించడం, బాడీ పాజిటివిటీ, ఎలా ఉన్నా మనల్ని మనం అంగీకరించుకోవాడం లాంటివాటి ప్రాముఖ్యాన్ని మరోసారి తెలియజేసిందంటూ ప్రశంసిస్తున్నారు.
ఇక సినిమాల(Yami Gautam Movies) పరంగా ఇటీవలే వచ్చిన 'భూత్ పోలీస్'లో సందడి చేసింది యామీ. తర్వాత ఆమె నుంచి 'లాస్ట్', 'దస్వీ', 'ఎ థర్స్డే' అనే చిత్రాలు రానున్నాయి.
ఇదీ చూడండి: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్యా రాయ్ హొయలు.. ఫొటోలు వైరల్