ఎన్నో ఇంటర్వ్యూల్లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్(pawan Kalyan)పై తనకున్న అభిమానాన్ని బాహాటంగానే చెప్పారు 'బాహుబలి' కథా రచయిత విజయేంద్రప్రసాద్. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతుందని వార్తలూ వచ్చాయి. విజయేంద్ర ప్రసాద్.. పవర్‌స్టార్‌కు కథ వినిపించారని, అది ఆయనకు నచ్చిందని అన్నారు. తాజాగా ఈ విషయమై స్పందించిన స్టార్ రైటర్ అదంతా అవాస్తమని వెల్లడించారు. పవన్ చిత్రానికి కథ రాయాలని ఎదురుచూస్తున్నానని.. కానీ స్టోరీ కోసం తనను ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు.
వరుస చిత్రాలతో..
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం 'అయ్యప్పనుమ్ కోశియుమ్'(Ayyappanum Kishiyum) రీమేక్‌తో పాటు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు'(Harihara Veeramallu) షూటింగ్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. వీటితో పాటు హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రాల్లో పవన్ నటించాల్సిఉంది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత విజయేంద్రప్రసాద్ కథ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.