ETV Bharat / sitara

సాహిత్యమే ఆయుధంగా జీవించిన గొల్లపూడి

author img

By

Published : Apr 14, 2020, 7:02 AM IST

గొల్లపూడి మారుతిరావు.. తెలుగునాట నటుడిగా, రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు. పత్రికా సంపాదకుడిగా తన ప్రస్థానం ప్రారంభించిన ఆయన వెండితెరపై నటనతోనూ రాణించారు. నేడు (ఏప్రిల్​ 14) గొల్లపూడి మారుతీరావు జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

Writer, Actor Gollapudi MaruthiRao Birth Anniversary Special Story
సాహిత్యమే ఆయుధంగా జీవించిన గొల్లపూడి

ప్రేక్షకులకు నటుడిగానే సుపరిచిమైనా... గొల్లపూడి మారుతీరావు ఒక సుప్రసిద్ధ రచయిత. సంపాదకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన మాటల రచయితగా సినీ రంగంపైనా... వ్యాఖ్యాతగా బుల్లితెరపైనా తనదైన ముద్రవేశారు. వక్తగా, కాలమిస్టుగా ఆయన ఎంతో పేరు సంపాదించుకున్నారు. తెలుగు సాహిత్యంపై ఆయన రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్‌లోని పలు విశ్వ విద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి.

గొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్‌ 14న విజయనగరంలోని ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావులకి ఐదో అబ్బాయిగా మారుతీరావు జన్మించారు. విశాఖపట్నంలోని సీబీఎం ఉన్నత పాఠశాల, ఎ.వి.ఎన్‌.కళాశాలతోపాటు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మారుతీరావు విద్యాభ్యాసం సాగింది. బీఎస్సీ (ఆనర్స్‌) పూర్తి చేసి 1959లో ఆంధ్రప్రభ ఉప సంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత రేడియోలో ట్రాన్స్‌మిషన్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఎంపికై.. హైదరాబాద్​, విజయవాడలో పనిచేశారు. ఆ తర్వాత కార్యక్రమ నిర్వాహకుడిగా పదోన్నతి పొంది.. సంబల్‌పూర్, చెన్నై, కడప కేంద్రాల్లోనూ సేవలందించారు.

Writer, Actor Gollapudi MaruthiRao Birth Anniversary Special Story
గొల్లపూడి మారుతీరావు

ఆకాశవాణి కేంద్రంలో ఉద్యోగిగా..

1981లో ఆకాశవాణి కడప కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన గొల్లపూడి.. రెండు దశాబ్దాలు పనిచేశారు. అసిస్టెంట్‌ స్టేషన్‌ డైరెక్టర్‌ హోదాలో పదవీ విరమణ చేశారు. చిరంజీవి కథానాయకుడిగా, కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' చిత్రంతో నటుడిగా సినీరంగం ప్రవేశం చేశారు. ఆ చిత్రానికి మాటల రచయితగానూ పనిచేశారు. చిన్న వయసులోనే 'రాఘవ కళానికేతన్‌' పేరుతో నాటక బృందాన్ని నడిపారు గొల్లపూడి. 'ఆడది', 'కుక్కపిల్ల దొరికింది', 'స్వయంవరం', 'రిహార్సల్స్', 'వాపస్' , 'మహానుభావాలు' నాటకాలకి నిర్మాణం, దర్శకత్వం వహించడమే కాకుండా.. ప్రధాన పాత్రధారిగానూ కనిపించారు.

మెగాస్టార్​ చిరంజీవితో గొల్లపూడి చిరంజీవి

విద్యార్థి దశలో ఉండగానే 'స్నానాలగది', 'మనస్తత్వాలు' అనే నాటకాల్లోనూ తన అభినయాన్ని ప్రదర్శించారు. అప్పట్లో చైనా ఆక్రమణపై తెలుగులో మొట్టమొదటి నాటకం 'వందేమాతరం' రచించి.. చిత్తూరు, మదనపల్లె, నగరిలలో ప్రదర్శించగా వచ్చిన రూ.50 వేలు నిధుల్ని ప్రధాన మంత్రి రక్షణ నిధికి అందజేశారు. ఆ నాటకాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార శాఖ ప్రచురించింది. అప్పటి విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి పీవీ నరసింహారావు దానికి ఉపోద్ఘాతం రాశారు. 1959 డిసెంబరు 16న 'రాగరాగిణి' అనే నాటకం అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఎదుట ప్రదర్శించారు. ఆ తర్వాత 'పథర్‌ కే అన్సూ' అనే పేరుతో హిందీలోకి అనువదించారు.

1963లో 'డాక్టర్‌ చక్రవర్తి' చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు గొల్లపూడి. ఆయనకి అదే మొదటి సినిమా. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ కథా రచయితగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డుని అందుకున్నారు. 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' తర్వాత నటుడిగా బిజీ అయిపోయారు. 250 చిత్రాలకిపైగా సహ నటుడిగా, హాస్య నటుడిగా మెరిశారు. 'సంసారం ఒక చదరంగం', 'స్వాతిముత్యం', 'తరంగిణి', 'త్రిశూలం', 'అసెంబ్లీ రౌడీ', 'ముద్దుల ప్రియుడు', 'ఆదిత్య 369' తదితర చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ నిర్వహించిన పోటీలకి సంబంధించిన జ్యూరీ సభ్యుల్లోనూ ఒకరిగా వ్యవహరించారు. జాతీయ చలన చిత్ర అభివృద్ధి మండలి స్క్రిప్ట్‌ పరిశీలన విభాగంలో పనిచేశారు.

కుమారుడి పేరు మీద అవార్డు

మారుతీరావుకు 1961 నవంబరు 11న శివకామసుందరితో హనుమకొండలో వివాహం జరిగింది. ఈ దంపతులకి ముగ్గురు మగసంతానం. చిన్న కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్‌ 1992 ఆగస్టు 12న మరణించారు. తన తొలి ప్రయత్నంగా 'ప్రేమ పుస్తకం' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ, చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో మరణించారు. మారుతిరావు తన కుమారుడి జ్ఞాపకంగా గొల్లపూడి శ్రీనివాస్‌ జాతీయ అవార్డుని నెలకొల్పారు. ఉత్తమ నూతన దర్శకుడికి రూ.1.50 లక్షలు నగదు బహుమతిని, ప్రముఖ చిత్ర కారుడు బాపు రూపొందించిన బంగారపు జ్ఞాపికనూ ప్రదానం చేస్తున్నారు. సినిమాకు సంబంధించి విశేష ఉపన్యాసం చేసిన ప్రముఖునికి గౌరవ సూచకంగా రూ.15 వేలు గొల్లపూడి మెమోరియల్‌ లెక్చర్‌ పేరిట బహుమానం అందిస్తున్నారు. సునీల్‌దత్, నసీరుద్దీన్‌ షా, మృణాల్‌ సేన్, శ్యాంబెనగల్, జావెద్‌ అక్తర్, అనుపమ్‌ ఖేర్‌ తదితరులు ఇందులో ప్రసంగించిన ప్రముఖుల్లో ఉన్నారు.

పురస్కారాలు

సినీ రచయితగా నాలుగు నంది పురస్కారాలు సొంతం చేసుకున్న గొల్లపూడి మారుతీరావుకి.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి కళారత్నతో పాటు మరెన్నో విశిష్ట పురస్కారాలు లభించాయి. ఈటీవీ ప్రతిధ్వని కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన గొల్లపూడి మారుతీరావు పలువురు ప్రముఖల్ని ఇంటర్య్వూ చేశారు. 'మనసున మనసై', 'ప్రజావేదిక', 'వేదిక', 'సినీ సౌరభాలు' తదితర కార్యక్రమాలకు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

'ఇంటింటి రామాయణం', 'గణపతి', 'ఎవరి గోల వారిదే', 'ప్రేమలు పెళ్ళిళ్ళు', 'భార్యారూపవతీ శత్రు', 'ఏది నిజం?' తదితర ధారావాహికల్లోనూ నటుడిగా మెప్పించారు.

ఇదీ చూడండి.. గొల్లపూడి మారుతీరావు సినీ ప్రస్థానం సాగిందిలా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.