విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' ట్రైలర్.. నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే టీజర్‌తో ఆకట్టుకున్న చిత్రబృందం.. ఈ ప్రచార చిత్రంతో ఆ అంచనాల్ని మరింత పెంచేసింది. విజయ్ సరసన నలుగురు ముద్దుగుమ్మలు నటిస్తుండటం, రొమాంటిక్ సన్నివేశాలు.. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అనే ఆసక్తిని కలిగిస్తున్నాయి.
"ఈ ప్రపంచంలో నిస్వార్థమైనది ఏదైనా ఉందంటే అది ప్రేమొక్కటే.. ఆ ప్రేమలోనూ నేను అనే రెండక్షరాలు ఓ సునామీనే రేపగలవు. ఐ వాంటెడ్ టూ బీ వరల్డ్ ఫేమస్ లవర్" అంటూ విజయ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.
ఇందులో కేథరిన్, ఇస్బెల్లా, రాశీఖన్నా, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గోపీసుందర్ సంగీతమందిస్తున్నాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కేఎస్ రామారావు నిర్మిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">