రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా టీజర్ వచ్చేసింది. 'వరల్డ్ ఫేమస్ లవర్'గా విజయ్ ఆకట్టుకుంటున్నాడు. నలుగురు భామలు ఇతడి సరసన నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆ పోస్టర్లు అలరిస్తున్నాయి.
"ప్రేమంటే ఓ కాంప్రమైజ్(సర్దుకుపోవడం) గౌతమ్.. ప్రేమంటే ఓ సాక్రిఫైజ్(త్యాగం).. ప్రేమలో దైవత్వం ఉంటుంది. అవేవి నీకు అర్థం కావు" అనే డైలాగ్ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.
ఇందులో ఐశ్వర్య రాజేశ్, కేథరిన్, ఇస్బెల్లా, రాశీఖన్నా.. హీరోయిన్లుగా కనిపించనున్నారు. గోపీసుందర్ సంగీతమందిస్తున్నాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కెఎస్ రామారావు నిర్మాతగా వ్యవరిస్తున్నారు. వచ్చే నెలలో వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">