ETV Bharat / sitara

మహిళా దినోత్సవానికి అప్పుడే పరిపూర్ణత - ఉమెన్స్​ డే నటి పూర్ణ

ప్రతి రంగంలోనూ రాణిస్తున్న మహిళలకి సమాజంలో గౌరవం, గుర్తింపు దక్కితేనే మహిళా దినోత్సవానికి సార్థకత, పరిపూర్ణత చేకూరుతుందని అన్నారు నటి పూర్ణ. క్రమశిక్షణతో ఎలా మెలగాలో అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు చెప్పాలని తల్లిదండ్రులకు సూచించారు.

poorna
నటి పూర్ణ
author img

By

Published : Mar 8, 2021, 6:45 AM IST

"బలమైన పాత్ర ఇది... అందుకు తగ్గ నటిని వెతుకుతూ మీదాకా వచ్చాం అంటుంటారు చాలా మంది దర్శకులు. అలా చూసుకుంటే నేను బలమైన నటినే కదా. నటిగానే కాదు, నిజజీవితం పరంగా నా వ్యక్తిత్వం కూడా బలమైనదే" అంటోంది పూర్ణ. తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళుతున్న కథానాయిక ఈమె. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న సినిమాలోనూ ఓ కథానాయికగా నటిస్తోంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమెతో 'ఈనాడు సినిమా' ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె చెప్పిన విషయాలివీ...

poorna
నటి పూర్ణ

"మహిళ అంటే త్యాగానికి ప్రతీక. మా అమ్మ త్యాగంతోనే నేనిక్కడ ఉన్నా. అలా ఎంతోమంది అమ్మల త్యాగాన్ని, వాళ్లు సాధించిన కీర్తిని గుర్తు చేసుకోవడానికి ఇంతకంటే గొప్ప రోజు ఏం ఉంటుంది? అయితే మహిళా దినోత్సవం అంటూ ఒక రోజు సంబరం చేసేసి, ఆ తర్వాత మహిళల్ని మరిచిపోకూడదు. ప్రతి రంగంలోనూ రాణిస్తున్న మహిళలకి సమాజంలో గౌరవం, గుర్తింపు ఎప్పుడూ దక్కాల్సిందే. సమాజంలో వాళ్లకి సగం దక్కాల్సిందే. అప్పుడే మహిళా దినోత్సవానికి సార్థకత, పరిపూర్ణత చేకూరుతుంది. మా కుటుంబంలో మేం నలుగురు అక్కాచెల్లెళ్లం. ఒక సోదరుడు. మా ఇంట్లో మహిళలే ఎక్కువన్నమాట. ఒక గ్రామీణ ముస్లిం కుటుంబం మాది. అమ్మాయి కదా తనకి ఇవన్నీ ఎందుకని కాకుండా... నాకు నృత్యంలో ఆసక్తి ఉందని గమనించి ప్రోత్సహించింది అమ్మ. అమ్మ ప్రోత్సాహంతో చిన్నప్పట్నుంచే నృత్యం నేర్చుకున్నా. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చా".

అబ్బాయిలకు నేర్పించాలి

"అమ్మాయిలకి తల్లిదండ్రులు బోలెడన్ని జాగ్రత్తలు చెబుతుంటారు. ఇలా ఉండాలి, ఇలా చేయకూడదు, అలా వెళ్లకూడదు అని కొన్ని పరిధులు విధిస్తుంటారు. మహిళలకి హక్కులు ఉన్నాయని అన్నీ చేయకూడదని చెబుతుంటారు. ఇంత వయసొచ్చినా మా అమ్మానాన్నలు ఇప్పటికీ నాకు జాగ్రత్తలు చెబుతుంటారు. క్రమశిక్షణతో మెలగాలని చెప్పడం మంచిదే. అయితే అదే స్థాయిలో ఇంట్లో అబ్బాయిలకి కూడా ఆ తరహా జాగ్రత్తలు చెప్పాలి. ముఖ్యంగా అమ్మాయిల పట్ల, సమాజం పట్ల ఎలా మెలగాలో నేర్పించాలంటాను. అప్పుడే మహిళలకి రక్షణ".

poorna
నటి పూర్ణ

మరింతమంది రావాలి

"చిత్ర పరిశ్రమలో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోంది. ఇది మంచి పరిణామం. మహిళల కథలు కూడా విరివిగా వెలుగు చూస్తున్నాయి. మహిళా దర్శకులు మరింత మంది వస్తే మరిన్ని ఫలితాలు ఉంటాయి. అయితే ఇప్పటికీ 80 శాతం హీరోల ఆధిపత్యమే చిత్రసీమలో కనిపిస్తుంది. ఎప్పట్నుంచో ఉన్నదే ఇది. హీరోల సినిమాలు రావాల్సిందే, కానీ అప్పుడప్పుడైనా నాయికా ప్రాధాన్య చిత్రాలు రావాలి. అది సమాజానికి మంచిది కూడా".

ఆ గుర్తింపైతే దక్కింది

"15 ఏళ్లుగా నాయికగా ప్రయాణం చేస్తున్నా. అగ్ర హీరోల సినిమాలేవీ నేను చేయలేదు. కానీ పూర్ణ అంటే బలమైన నటి అనే గుర్తింపు సొంతమైంది. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు బాలకృష్ణ సర్‌ సినిమాలో నటిస్తున్నా. అలాగే ‘తలైవి’ చిత్రంలో శశికళగా నటించా. బాలకృష్ణ - బోయపాటి కలయికలో రూపొందుతున్న సినిమాలో నా పాత్ర పేరు పద్మావతి. అది బలమైన పాత్ర. అలాగే వెంకటేష్‌ సర్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘దృశ్యం2’లో ఓ చిన్న పాత్రని చేస్తున్నా".

ఇదీ చూడండి: బాలకృష్ణ చిత్రంలో ప్రతినాయకురాలిగా పూర్ణ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.