"నాకు తెలిసి అమ్మాయిల్లోని నిజమైన అందాన్ని 15 - 16ఏళ్ల వయసులోనే చూడొచ్చు. మళ్లీ అదే అందం 50ఏళ్ల వయసులోనే కనిపిస్తుంది" అంటోంది నటి శ్రుతిహాసన్.
"అమ్మాయిలు 30ల్లోనే అందంగా కనిపిస్తుంటారన్న మాటతో నేను ఏకీభవించను. నా దృష్టిలో మహిళల్లోని పరిపూర్ణమైన అందం.. 50ఏళ్ల వయసులోనే కనిపిస్తుందని నమ్ముతా. కాల ప్రయాణం నేర్పిన అనుభవాల వల్ల వాళ్లలో ఓ ధైర్యం నిండి ఉంటుంది. ఇక టీనేజీ విషయానికి వస్తే 15 - 16ఏళ్ల వయసులో అందంగా కనిపిస్తారు. 20ల్లో ఉన్నప్పుడు జీవితం గురించి తెలుసుకోవడానికి పెద్దగా ఏం ఉండదు. అప్పటికి ప్రపంచం గురించి తెలిసింది తక్కువే. ఎవరికి వారు అప్పుడప్పుడే లక్ష్యాలు నిర్దేశించుకుంటారు. నా వరకైతే 30ల్లోకి వచ్చాకే.. నన్ను నేను తెలుసుకోవడం మొదలు పెట్టా. అసలైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నా. మనసుకు నచ్చినట్లు బతకడం మొదలు పెట్టా."
- శ్రుతిహాసన్, కథానాయిక
సంక్రాంతికి విడుదలైన 'క్రాక్'(Krack) సినిమాతో తిరిగి జోరు అందుకుంది హీరోయిన్ శ్రుతిహాసన్. ఇప్పుడు ఆమె చేతుల్లో పలు తెలుగు, తమిళ చిత్రాలతో పాటు ప్రభాస్‌కు జోడీగా 'సలార్'(Salaar) చిత్రంలో నటిస్తోంది.
ఇదీ చూడండి: Tollywood News: షూటింగ్ సందడి ఎప్పుడో?