ETV Bharat / sitara

Women in Cinema: సినీ వినీలాకాశంలో మహిళాకాంతులు - అనుష్క

Women in Cinema: ఆమె నిర్మాత... మన జీవన గమనాన్ని పునాదుల నుంచి నిర్మించే అమ్మ. ఆమె దర్శకురాలు... కష్టనష్టాల్లో కూలిపోకుండా సరైన మార్గంలో నడిపించే గురువు. ఆమె నాయిక... గెలుపోటముల్లో తోడుగా నిలిచే సతి. మన కలను తన కళ్లతో చూసి ప్రోత్సహించే సినిమాటోగ్రాఫర్‌... మన కళకు రంగులద్దే ఆర్ట్‌ డైరెక్టర్‌... ఆమె. జీవిత తెరపై వందేళ్ల విజయోత్సవానికి మెరిసిన తారక... ఆమె. సినీ వినీలాకాశంలో ప్రకాశిస్తున్న మహిళామణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

Women in Cinema
samantha oh baby
author img

By

Published : Mar 8, 2022, 6:52 AM IST

Updated : Mar 8, 2022, 7:28 AM IST

Women in Cinema: హీరో... హీరోయిజం - సినిమా అంటే ఇంతేనేమో అనుకునే పరిస్థితి ఒకప్పుడు. నాయిక ఆడిపాడటానికే అన్నట్టుగా కనిపించేది. తెరపైన సంగతే కాదు, తెరవెనక కూడా మగువల ప్రాభవం పెద్దగా కనిపించేదే కాదు. మరి ఇప్పుడో! ఏ సినిమా సెట్‌కి వెళ్లినా మహిళల సందడే. మేకప్‌... కాస్ట్యూమ్‌ మొదలుకొని... నిర్మాణం, దర్శకత్వం వరకు అన్ని విభాగాల్లోనూ సత్తా చాటుతున్నారు మహిళలు. రంగుల కళ అయిన సినిమాకి మరింత వన్నె తీసుకొస్తున్నారు. వాళ్ల జోరుకి తగ్గట్టే తెరపైన కథలూ, పాత్రల తీరుతెన్నులూ మారుతున్నాయి. హీరోయిజమే కాదు.. హీరోయినిజం కూడా ఉంటుందని చాటుతూ మహిళల కథలు విరివిగా రూపొందుతున్నాయి. అలా నిర్మాతగా విజయవంతంగా ప్రయాణం చేస్తున్నారు సునీత తాటి. సమంతతో 'ఓ బేబి' చిత్రాన్ని నిర్మించి విజయాన్ని అందుకున్నారీమె. ప్రస్తుతం రెజీనా, నివేదా థామస్‌తో 'శాకిని ఢాకిని' సినిమాని నిర్మిస్తున్నారు. సమంత ప్రధాన పాత్రధారిగా నటిస్తున్న 'శాకుంతలం'తో తన ప్రయాణాన్ని ఆరంభించిన మరో నిర్మాత... నీలిమ గుణ. మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వీరి ప్రయాణం, అంతరంగం 'ఈనాడు సినిమా'కి ప్రత్యేకం...

కొత్త కథలొస్తాయి

"అమ్మాయిలు... అబ్బాయిలు అనే తేడా తొలగిపోతోంది. అన్ని రంగాల్లోనూ ఇప్పుడందరికీ సమానమైన అవకాశాలు ఉన్నాయి. సినీ రంగాన్నే తీసుకుంటే ఇదివరకటిలా కాకుండా... ఇప్పుడు సెట్లో ఎక్కువమంది అమ్మాయిలే కనిపిస్తుంటారు. ఆసక్తే ఉంటే దానికి తగ్గట్టుగా సన్నద్ధమై అమ్మాయిలు ధైర్యంగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టొచ్చనేది అభిప్రాయం. ఓ మహిళా నిర్మాతగా నాకైతే అమ్మాయిలు చెప్పే మరిన్ని కథలు వినాలి, వాటిని సినిమాలుగా తెరపై చూడాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. రచనా విభాగంలో మరింత మంది మహిళలు వస్తే చాలా మేలు జరుగుతుంది. కొత్త కథలు కచ్చితంగా వెలుగులోకి వస్తాయి".

"ఇద్దరు కూతుళ్లకి తండ్రిగా మా నాన్న దర్శకుడు గుణశేఖర్‌ మొదట్నుంచీ మహిళల్ని ప్రోత్సహిస్తుంటారు. మహిళా ప్రధానమైన సినిమాలు తరచూ చేస్తుంటారు. 'ఒక్కడు', 'మనోహరం' లాంటి సినిమాల్లోనూ బలమైన మహిళల పాత్రలు కనిపిస్తుంటాయి. ప్రస్తుతం ఆయన దర్శకుడిగా, నేను నిర్మాతగా రూపొందిస్తున్న 'శాకుంతలం'లోనూ ఎక్కువ మంది అమ్మాయిలే పనిచేస్తున్నారు. అనుభవజ్ఞులైన నీతా లుల్లా మొదలుకొని... కొత్త ప్రతిభావంతుల వరకు ఎంతోమంది మహిళలు మా సినిమాకి పనిచేస్తున్నారు".

Women in Cinema
నీలిమ గుణ

"నాన్నని స్ఫూర్తిగా తీసుకునే నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చా. అమ్మాయివి కదా, ఈ రంగంలోకి ఎందుకు అని ఆయన ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. నాకు ఆసక్తి ఉందని తెలిశాక... ప్రాక్టికల్‌గా తెలియడమే కాదు, థియరీ పరంగా కూడా చదువుకుని వస్తే బాగుంటుందని ప్రోత్సహించారు. విదేశాల్లో నేను విజువల్‌ కల్చర్‌ చదువుకుని వచ్చాను. 'రుద్రమదేవి' సినిమాకి నేను ఇంటర్న్‌షిప్‌ చేస్తూ, దానికి సహనిర్మాతగా పనిచేశా. అప్పుడు కథానాయిక అనుష్క పనిపై చూపే శ్రద్ధ, ఆమె నిబద్ధత నన్నెంతగానో ప్రభావితం చేసింది. మళ్లీ అదే తపనని నేను 'శాకుంతలం' సెట్లో సమంతలోనూ చూశా".

"అమ్మాయిని కాబట్టే నిర్మాతగా నా తొలి ప్రయత్నంగా మహిళా ప్రధానమైన సినిమానే చేయాలనేమీ అనుకోలేదు. రోమియో జూలియట్‌ తరహా ప్రేమకథలు మన పురాణాల్లోనూ ఉన్నాయని లండన్‌లో కొన్ని షోస్‌ చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది. అక్కడ చదువు పూర్తయ్యాక ఇండియాకి వచ్చినప్పుడు మా నాన్న 'శాకుంతలం' స్క్రిప్ట్‌ రాస్తున్నారు. నిర్మాతగా నేను ప్రయాణం ఆరంభించడానికి తగిన కథ ఇదని ఆ క్షణమే అనుకున్నా. ఇప్పుడు మహిళా ప్రధానమైన కథలే కాదు... వాణిజ్య ప్రధానమైన సినిమాల్లోనూ మహిళలకి ప్రాధాన్యం కనిపిస్తోంది. హీరోతో కలిసి ఆడిపాడటానికి పరిమితమైన దశ నుంచి... వాళ్లపైనే కథలు సాగడం, వాళ్లే మలుపు తిప్పే కథలు ఇప్పుడు తెరపైకొస్తున్నాయి. ఇది మంచి పరిణామం".

- నీలిమ గుణ, 'శాకుంతలం' నిర్మాత

ఆడ మగ కాదు.. ప్రతిభే ముఖ్యం

"అమ్మాయిలు చిత్ర పరిశ్రమ మాటెత్తగానే 'అబ్బా..అందులోకి వెళ్లడమా?' అంటూ సంకోచిస్తుంటాయి చాలా కుటుంబాలు. అలాంటి భయాలు లేకుండా ప్రోత్సహిస్తే చాలా సంతోషిస్తా. అలాంటి అడ్డంకుల్నే దాటుకుని... మనం కనే ఓ కల నిజం అవుతుందని నిరూపిస్తూ మాకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకుంటే, ఆ ధైర్యాన్ని అమ్మాయిలూ తెచ్చుకుంటే ఇది నిజంగా మరో మంచి మహిళా దినోత్సవం అవుతుంది".

"ఇలాంటి రోజులు పాశ్చాత్య సంస్కృతి నుంచి వచ్చినవంటూ తోసి పుచ్చుతుంటారు చాలా మంది. ఏ సంస్కృతైనా మంచిదైతే స్వీకరించడంలో తప్పేం లేదు. నా దృష్టిలో మహిళా దినోత్సవం చాలా ముఖ్యం. మన ఇళ్లల్లో అమ్మాయిలకి చిన్నప్పట్నుంచి డ్యాన్సులు, పాటలు నేర్పిస్తారు కానీ... పెళ్లవ్వగానే ఇక ఇవేమీ అక్కర్లేదు అనేస్తుంటారు. వాళ్ల కలలు, ప్రతిభ.. పెళ్లయిన క్షణం నుంచి భార్య అనే స్థానం కింద మరుగున పడిపోతుంటాయి. మహిళకంటూ కొన్ని భావనలు ఉన్నాయనే విషయాల్ని ఇలాంటి రోజునైనా పదిమందికి గుర్తు చేస్తుంటాం. ఏటా ఓ పది వేల మంది అమ్మాయిలు ప్రభావితమైనా చాలు కదా. అమ్మని దైవంగా కొలిచే సంస్కృతి మనది. కానీ పండగ రోజు కూడా అమ్మే ఉపవాసం ఉండి, పూజ చేసి మనకు ప్రసాదం పెడుతుంది. అమ్మ కష్టాన్ని పండగల రోజు కూడా గుర్తు చేసుకోని మనం...మాతృదినోత్సవం వచ్చిందంటే ఆమెని ఇంట్లో ఏమీ చేయనివ్వకుండా బయట నుంచి ఆహారం తెప్పిస్తాం. మనం మరిచిపోయే చాలా విషయాల్ని ఇలా ప్రత్యేకమైన రోజుల ద్వారానైనా గుర్తు చేసుకోవడం మంచిదే కదా".

Women in Cinema
సునీత తాటి

"మహిళా ప్రధానమైన కథలే తీయాలని చెప్పడం కాదు. ఏళ్ల తరబడి 'ఇది వర్కౌట్‌ అవుతుంద'ంటూ అమ్మాయిల భావోద్వేగాల్ని మగవాళ్లే రాస్తూ వాళ్లపై సానుభూతి కలిగేలా చేస్తూ, చివరికి మహిళని ఓ బలిపశువులా చూపిస్తుంటారు. వాళ్లకేదో అన్యాయం జరిగిపోతోందని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. నిజంగా అన్యాయం చేస్తున్నప్పుడు ఎవ్వరం పట్టించుకోం. అలాంటి ప్రయత్నాల్ని ఆపేస్తే మేం సంతోషిస్తాం. ఇప్పుడు మాకు నిజంగా ఒక అమ్మాయి ఆ క్షణంలో ఎలాంటి భావనకి గురవుతుందో చెబితే చాలు. నేన కథని మామూలుగానే చూస్తాను తప్ప ఇది అమ్మాయి కోణంలో ఉందా లేదా అని చూడను. ప్రేక్షకులకు ఇందులో నా కథ కూడా కొంత ఉంది అనిపించాలి. అలాంటి కథలే నన్ను ప్రభావితం చేస్తుంటాయి".

"నా సినిమాల్లో 'ఓ బేబీ' ఒక్కటే మహిళా ప్రధాన చిత్రం. మిగిలిన సినిమాల్లో ఆడ, మగ ఇద్దరూ సమానంగా కనిపిస్తారు. 'శాకినీ ఢాకినీ' ఇద్దరు హీరోలు చేయాల్సిన కథ. కానీ ఎవ్వరూ కలిసి చేయడానికి ముందుకు రాలేదు. ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత సంయుక్త 'ఆ కథని అమ్మాయిలతో తీస్తే ఎలా ఉంటుంద'నే ఆలోచన ఇచ్చింది. అదే విషయం డి.సురేష్‌బాబుతో చెబితే 'ఎందుకు చేయకూడదు?' అన్నారు. అలాంటి ప్రోత్సాహం నుంచే కొత్తదారులు పుట్టుకొస్తుంటాయి. శ్రీసింహాతో 'దొంగలున్నారు జాగ్రత్త' సినిమాని నిర్మిస్తున్నాం. మరో మూడు చిత్రాల రూపకల్పనకి సన్నాహాలు చేస్తున్నాం".

- సునీత తాటి, 'ఓ బేబి' నిర్మాత

"మన దగ్గర ప్రతిభ ఉండి, కష్టపడి పనిచేయడాన్ని అలవాటు చేసుకుంటే చిత్ర పరిశ్రమలో ఆడా మగా అనే వ్యత్యాసం ఎక్కడా కనిపించదు. నువ్వు చేసిన పనికే ఇక్కడ గుర్తింపు. ఆ అమ్మాయి కచ్చితంగా ఉంటుందని నన్ను సహాయ దర్శకురాలిగా ప్రోత్సహించారు. మంచి కథ చెబుతుందనే నాతో కలిసి నిర్మాణం చేయడానికి ముందుకొచ్చారు. ఆడవాళ్లకి అవకాశాలు ఉన్నాయి. వాటిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మహిళలపై ఉంది".

ఇదీ చూడండి: మహేశ్​బాబు- రాజమౌళి చిత్రంలో ఆలియాభట్​..!

Last Updated : Mar 8, 2022, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.