మానసిక ప్రశాంతత కోసమే తాను ఇన్‌స్టా నుంచి కొంతకాలం విరామం తీసుకున్నానని చెప్పింది మలయాళీ భామ ప్రియాప్రకాశ్ వారియర్. 'ఒరు అదార్ లవ్'లోని ఒక్క పాటతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. తక్కువకాలంలోనే ఎక్కువమంది అభిమానులను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ అభిమానులతో టచ్‌లో ఉండేది. అయితే లాక్‌డౌన్ ప్రారంభంలో హఠాత్తుగా ఇన్‌స్టా నుంచి వైదొలిగింది. దీంతో ఆమె అభిమానులు, ప్రియకు ఏమైందా? అని అనుకున్నారు. దాదాపు రెండు వారాల తర్వాత ఇప్పుడు మళ్లీ ఇన్‌స్టాలోకి వచ్చిన ఈ భామ.. బ్రేక్ తీసుకోడానికి గల కారణాన్ని వివరిస్తూ ఓ వీడియోను పంచుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"హాయ్ ఆల్.. చిన్న విరామం తర్వాత ఇన్‌స్టాలోకి వచ్చాను. సోషల్ మీడియాకు దూరంగా ఉండడానికి గల కారణం ఏమిటో తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మానసిక ప్రశాంతత అవసరం, అందుకే బ్రేక్ తీసుకుని రెండు వారాలు ఎంతో సరదాగా, ప్రశాంతంగా జీవించాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగత విషయం. అయితే, ఇన్‌స్టా నుంచి వైదొలిగిన సమయంలో చాలామంది నాపై ట్రోల్స్ చేశారు. కామెంట్లు పెట్టారు. వాటిల్లో ఒక ట్రోల్ నన్ను ఎంతో బాధపెట్టింది. 'పబ్లిసిటీ కోసమే ప్రియా ఇన్‌స్టా నుంచి వైదొలిగింది' అని పెట్టారు. అది చూసి ఎంతో బాధపడ్డాను. కరోనా వైరస్ పరిస్థితుల నుంచి త్వరితగతిన సాధారణ జీవితంలోకి అడుగుపెట్టాలని ప్రతి ఒక్కరూ దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. ఇలాంటి సమయంలో పబ్లిసిటీ కోసం ఎవరైనా చూస్తారా? ఇలాంటి పోస్టులు పెట్టేవాళ్లకు బుద్ధి లేదా అని అనిపించింది" అని ప్రియా ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి : 'అవన్నీ పుకార్లే.. ఆ ఆఫర్ నాకు రాలేదు'