ETV Bharat / sitara

'రాధేశ్యామ్' సినిమా 'గీతాంజలి' మ్యాజిక్​ను రిపీట్​ చేస్తుందా? - తెలుగు లవ్​స్టోరీ మూవీస్

Prabhas Radhe shyam: డార్లింగ్ ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. అప్పట్లో పూర్తిస్థాయి ప్రేమకథతో రూపొందిన 'గీతాంజలి' సెన్సేషన్​ సృష్టించింది. మరి 'రాధేశ్యామ్' ఆ మ్యాజిక్​ను రిపీట్​ చేస్తుందా?

prabhas radhe shyam movie
ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ
author img

By

Published : Dec 12, 2021, 6:38 PM IST

Updated : Dec 12, 2021, 7:54 PM IST

Geethanjali movie: ఇప్పడంటే యాక్షన్, థ్రిల్లర్ స్టోరీలు ఎక్కువైపోయాయి కానీ 90ల్లో మాత్రం ప్యూర్ లవ్​స్టోరీలు వచ్చేవి. ప్రేక్షకులు కూడా వాటికి నీరాజనాలు పలికేవారు. 'గీతాంజలి' సినిమానే తీసుకోండి. ప్రముఖ దర్శకుడు మణిరత్నం.. ఈ సినిమాను అద్భుత దృశ్యకావ్యంగా మలిచారు.

ప్రేమకథకు తోడు ప్రకృతి అందాలు ఈ సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాయి. ఇప్పటికీ ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాయి. అప్పట్లో బాక్సాఫీస్​ను షేక్​ చేసిన ఈ చిత్రం.. కుర్రాళ్లను మళ్లీమళ్లీ థియేటర్లకు రప్పించింది.

ఆ తర్వాత కాలంలో స్టార్ హీరోలు ఇలాంటి సినిమాలు చేయడం తగ్గిపోయింది! డైరెక్టర్లు కూడా బీ,సీ సెంటర్ల ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని మాస్ మసాలా ఎంటర్​టైనర్స్​ రూపొందించడానికే ఎక్కువగా ప్రాధాన్యమిస్తూ వచ్చారు. నిర్మాతలు కూడా స్టార్లతో పూర్తిస్థాయి ప్రేమకథలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు!

prabhas pooja hegde
ప్రభాస్-పూజాహెగ్డే

Radhe shyam love anthem: కానీ చాలాకాలం తర్వాత బాగా డెప్త్ ఉన్న లవ్​స్టోరీతో 'రాధేశ్యామ్'ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. విజువల్స్ కూడా గ్రాండ్​గా ఉండనున్నట్లు ఇప్పటికే రిలీజైన పాటలు, పోస్టర్లు చెప్పకనే చెబుతున్నాయి. హిందీలో విడుదలైన పాటలతే మిలియన్ల కొద్ది వ్యూస్​ సాధిస్తూ.. సినిమాపై అంచనాల్ని భారీగా పెంచేస్తున్నాయి. మరి ప్రభాస్-పూజాహెగ్డే నటించిన ఈ ప్రేమకథ.. 'గీతాంజలి' మ్యాజిక్​ను రిపీట్​ చేస్తుందా? లేదా? అనేది తెలియాలంటే జనవరి 14 వరకు ఆగాల్సిందే.

prabhas pooja hegde radhe shyam
ప్రభాస్-పూజా హెగ్డే

పాన్ ఇండియా రేంజ్​లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్.. హస్తరేఖలు చూసి భవిష్యత్తు చెప్పే వ్యక్తిగా కనిపించనున్నారు. పూజాహెగ్డే డాక్టర్​గా నటించింది. భాగ్యశ్రీ, జయరామ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దక్షిణాదిలో జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

Last Updated : Dec 12, 2021, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.