డార్లింగ్ ప్రభాస్ 'ఆదిపురుష్' ప్రారంభమైందా? వినాయకుడి చిత్రపటానిని పూజ చేసిన ఓ ఫొటో వైరల్ కావడం వల్లే అభిమానులకు ఈ సందేహం వచ్చింది. అలానే మంగళవారం(జనవరి 19) ఉదయం 7:11 గంటలకు అప్డేట్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అది ఏమై ఉంటుందా అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.
ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముంది.
ఈ పాన్ ఇండియా చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తుండగా, టీ-సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఆగస్టు 11న థియేటర్లలో.. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
ఇవీ చదవండి: