ETV Bharat / sitara

స్టార్​ క్రికెటర్​ బయోపిక్​లో హృతిక్​ రోషన్​!

author img

By

Published : Feb 26, 2020, 12:01 AM IST

Updated : Mar 2, 2020, 2:34 PM IST

బీసీసీఐ అధ్యక్షుడు, ప్రముఖ క్రికెటర్​ సౌరభ్​​ గంగూలీ బయోపిక్​ బాలీవుడ్​లో తెరకెక్కనుందని సమాచారం. ఈ పాత్రలో హృతిక్​ రోషన్​ కనిపించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

hrithik
మరో స్టార్​ క్రికెటర్​ బయోపిక్​ హృతిక్​

ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ముఖ్యంగా క్రికెటర్ల జీవిత కథల్ని తెరకెక్కించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు దర్శకులు. ఈ వరుసలో ఇప్పటికే 'సచిన్‌ తెందుల్కర్', 'ఎంఎస్‌ ధోనీ' జీవిత గాథలు తెరపై ఆవిష్కృతమయ్యాయి. '83'గా భారత తొలి ప్రపంచకప్​ విజయమూ వెండితెరపై త్వరలో కనువిందు చేయనుంది. తాజాగా క్రికెట్‌ దిగ్గజం 'సౌరభ్​ గంగూలీ' జీవితం తెరపైకి రాబోతుందని బాలీవుడ్‌ టాక్‌. ఈ క్రికెటర్‌ పాత్రలో హృతిక్‌ రోషన్‌ కనిపిస్తాడని సమాచారం.

will-hrithik-roshan-play-sourav-ganguly-in-an-upcoming-biopic
సౌరభ్​​ గంగూలీ

మైదానంలో గంగూలీ ఎదుర్కొన్న సవాళ్లు, వ్యక్తిగత జీవితం సినీ అభిమానులకు పంచేందుకు ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహర్‌ ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే గంగూలీ, హృతిక్‌తో చర్చలు జరిపారని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.

2002 నుంచి 2005 వరకు భారత జట్టుకు సారథ్యం వహించాడు 'సౌరభ్​ గంగూలీ'. ఎన్నో విజయాలు అందుకుని 2008లో క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా విధులు నిర్వహిస్తున్నాడు దాదా.

పింక్ టెస్టు: ఈడెన్ తోటలో.. 'గులాబి' మనదేగులాబి ఆటతో.. గుర్తుండిపోయే రికార్డులు

Last Updated : Mar 2, 2020, 2:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.