LIVE : తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ప్రెస్‌మీట్ - KTR PRESS MEET LIVE
🎬 Watch Now: Feature Video
KTR PRESS MEET LIVE : రాష్ట్రంలో అమృత్ టెండర్లలో భారీగా అవినీతి జరిగిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఇవాళ బీఆర్ఎస్ భవన్‌లో మీడియాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.8,888 కోట్ల కుంభకోణాన్ని అందరి దృష్టికి తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలోనే కుంభకోణం ప్రారంభమైందని అన్నారు. బావమరిది, తమ్ముళ్లకు అమృతం, ప్రజలకు విషం అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితులు తయారయ్యాయని ఆవేదన చెందారు. అమృత్ టెండర్లలో సీఎం కుటుంబ సభ్యులు భారీ అవినీతికి పాల్పడ్డారని తీవ్రస్థాయిలో మరోసారి ఆరోపణలు చేశారు. బావమరిది కళ్లల్లో ఆనందం, ఇళ్లలో లంకె బిందెల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఐహెచ్పీని అడ్డం పెట్టుకొని అవినీతికి తెర లేపారని కేటీఆర్ విమర్శించారు. అమృత్ పథకం కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టేదని, ఫిబ్రవరిలో జరిగిన టెండర్ల వివరాలను ప్రభుత్వం ఇప్పటికీ బయటపెట్టడం లేదని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి దొరికిపోయారు, తప్పించుకోలేరని రాజీవ్ గాంధీ తెచ్చిన చట్టం ప్రకారం ప్రాసిక్యూట్ తప్పదని కేటీఆర్ తెలిపారు.
Last Updated : Sep 22, 2024, 11:33 AM IST