Virat Sledge Shakib AL Hasan : సాధారణంగా క్రికెట్లో స్లెడ్జింగ్ చేసే ప్లేయర్ల లిస్ట్‌లో టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ పేరు కచ్చితంగా ఉంటుంది. మైదానంలో దూకుడుగా ఆడే ఈ రన్నింగ్ మెషిన్, అప్పుడప్పుడు స్లెడ్జింగ్ ద్వారా ప్రత్యర్థులను ఆటపట్టిస్తుంటాడు. ఈ సారి కూడా తాను చేసిన ఓ పని నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది.
ఇంతకీ ఏం జరిగిందంటే?
చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆట సందర్భంగా ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. భారత్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత కోహ్లి క్రీజులోకి వచ్చాడు. అయితే అప్పుడు బౌలింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ స్టార్ స్పిన్నర్ షకీబ్ అల్‌హసన్ కోహ్లికి వరుసగా యార్కర్లు సంధించాడు. దీంతో విరాట్ మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న షకీబ్ వైపు చూసి "మలింగలా వరుసగా యార్కర్లు వేస్తున్నావు" అంటూ కామెంట్ చేశాడు.
ఇక కోహ్లి మాటలకు నవ్వుకున్న షకీబ్ తన ఫీల్డింగ్ పొజిషన్‌కు వెళ్లాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అయితే ఈ వీడియాపై శ్రీలంక స్టార్ క్రికెటర్ లసిత్ మలింగ కూడా స్పందించారు. తన సోషల్ మీడియా అకౌంట్లో దీన్ని రీ పోస్ట్ చేశారు.
Niyamai malli🤣🫶 https://t.co/heeEK48QRP
— Lasith Malinga (@malinga_ninety9) September 21, 2024
టెస్ట్‌లో విరాట్ నయా రికార్డు
Virat Kohli Records : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్లో మరో అరుదైన మైలురాయి అందుకున్నాడు. ఇప్పటివరకు విరాట్ అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి స్వదేశంలో 12 వేల పరుగులు పూర్తి చేశాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో 13 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీ ఈ ఫీట్ అందుకున్నాడు. ఈ జాబితాలో విరాట్ కంటే ముందు క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ఒక్కడే ఉన్నాడు.
కింగ్ అదుర్స్
భారత జట్టు తరఫున స్వదేశంలో 219 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 58.84 సగటుతో కోహ్లీ 12,008 పరుగులు చేశాడు. ఇందులో 38 సెంచరీలు, 59 అర్ధ శతకాలు ఉన్నాయి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ స్వదేశంలో 258 మ్యాచ్ ల్లో 50.32 సగటుతో 14,192 పరుగులు చేశాడు. ఇందులో 42 సెంచరీలు, 70 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కాగా, విరాట్ స్వదేశంలో మరో 2 వేల పరుగులు స్కోర్ చేస్తే సచిన్ రికార్డును అధిగమించవచ్చు.
విరాట్ LBW కాంట్రవర్సీ - రోహిత్ రియాక్షన్ వైరల్- ఔటా, నాటౌటా? - Ind vs Ban Test Seires 2024
ప్రాక్టీస్ సెషన్లోనూ విరాట్ మార్క్- కొడితే గోడ బద్దలైంది! - Virat Kohli Practice Session