ETV Bharat / sitara

నలుగురికి థ్యాంక్స్‌ చెప్పాలి నేను! - wild dog movie director ahisoor salman

ఓ మంచి మలుపు తిరిగేదాకా... సినిమా కెరీర్‌ ప్రయాణం ఎప్పుడూ మూడడుగులు ముందుకీ ఆరడుగులు వెనక్కీ అన్నట్టే ఉంటుంది. అందుకే ఆ జీవితాన్ని ‘పాకుడు రాళ్లు’ అన్నారు! ఆ రాళ్లపైన పడుతూలేస్తూ వచ్చి తెలుగులో తన తొలి సినిమాతోనే కింగ్‌ నాగార్జునకి ‘యాక్షన్‌’ చెప్పే అవకాశాన్ని దక్కించుకున్నాడు అహిసూర్‌ సాలమన్‌. ‘వైల్డ్‌డాగ్‌’ పోస్టర్‌లతోనే ప్రేక్షకుల అంచనాల్ని భారీగా పెంచగలిగాడు. ఇదివరకు ‘ఊపిరి’, ‘మహర్షి’ సినిమాలకి కథాకథనాల్ని అందించిన అహిసూర్‌ తన ప్రయాణంలోని ఎత్తుపల్లాల గురించి ఇలా చెప్పుకొచ్చాడు...

wild dog movie director ahisoor salman about his journey
నలుగురికి థ్యాంక్స్‌ చెప్పాలి నేను!
author img

By

Published : Sep 13, 2020, 12:44 PM IST

మన తెలుగు ప్రేక్షకుల్లో కొందరికి హిందీ సినిమాలు మరీ పరాయిగా అనిపించవు. తెలుగుకంటే హిందీ సినిమాలపైన విపరీతమైన మోజు ఉంటుంది. చిన్నప్పుడు నేను ఆ కోవకి చెందినవాణ్ణే. అమితాబ్‌ బచ్చన్‌ అంటే పడిచచ్చేవాణ్ణి. ఆయన నటించిన షరాబి, షోలే, దర్బార్‌, శక్తి సినిమాలని లెక్కలేనన్ని సార్లు చూశాను. ‘షరాబి’ సినిమాలోని ప్రతి డైలాగూ చెప్పగలిగేవాణ్ణి.

మాది కర్నూలు. అక్కడి ప్రకాశ్‌నగర్‌లోనే నేను పుట్టిపెరిగాను. నాన్న అన్నెపోగు సాలమన్‌... ఇన్‌కమ్‌టాక్స్‌ ఉద్యోగి. అమ్మ షేబా. నాకో అన్నయ్యా, చెల్లీ. మాకు సెలవులొస్తే చాలు వీసీపీ అద్దెకు తీసుకుని ఇంటిల్లిపాదీ బోలెడన్ని సినిమాలు చూసేవాళ్లం. కాకపోతే... ఇంట్లోవాళ్లందరూ రోజుకి మూడు సినిమాలు చూస్తే నేను ఆరు సినిమాలు చూడందే నిద్రపోయేవాణ్ణి కాదు. అందువల్లనేమో డిగ్రీ రెండో ఏడాదిలో ఉండగానే సినిమా పైన ఆసక్తి మొదలైంది.

పుణె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎఫ్‌టీఐఐ)లో చేరడమే లక్ష్యమైంది. మా నాన్నకేమో నా చేత ఎంబీఏ చేయించాలని ఉండేది. నా కోరిక నేను చెప్పాక... ఆయన తన ఆశ చెప్పాడు. మా అమ్మ నాకే ఓటేసింది. నాన్న ఒప్పుకోక తప్పలేదు. దాంతో డిగ్రీ చివరి ఏడాది ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని ఎదురుచూశాను. కాగానే... పుణె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌కి అప్లై చేసుకున్నాను. కానీ ఆ సంస్థలో నాకు సీటు రాలేదు. ఎంతో ఉత్సాహంగా ఉంటుందనుకున్న నా సినిమా ప్రయాణంలో ఎదురైన తొలి ఎదురుదెబ్బ అది!

మహేశ్‌ భట్‌తో...

ఎఫ్‌టీఐఐలో సీటు రాలేదని కుంగిపోయిన నాకు... పుణెలోనే ఉన్న ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బిజినెస్‌ అండ్‌ మీడియా అనే సంస్థ సీటిచ్చింది. అక్కడ మాస్‌ కమ్యూనికేషన్‌లో రెండేళ్ల పీజీ డిగ్రీలో చేరాను. సినిమాలని స్పెషలైజేషన్‌గా తీసుకున్నాను. దానిపైన నా ప్రాణమే పెట్టాను! సినిమాలకి సంబంధించిన పుస్తకాలు చదవడమే కాదు... ప్రపంచ చిత్రాలని చూడటం, నిపుణుల లెక్చర్లు వినడం ఓ గొప్ప అనుభవంగా ఉండేది.

ఓ రకంగా అది నా వ్యక్తిత్వాన్నీ మార్చింది. ఎంతైనా కర్నూలు కుర్రాణ్ణి కదా... నాలో కాస్త కోపం ఎక్కువగా ఉండేది. డిగ్రీ రోజుల్లో రౌడీలా కొట్లాటకు వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. కానీ పుణెకి వెళ్లాక నెమ్మదించాను. సినిమాలు వ్యక్తిత్వాన్ని మారుస్తాయా అంటే... నా అనుభవాన్ని బట్టి అవుననే చెబుతాన్నేను. పీజీ చివరి ఏడాదిలో ఉండగానే నన్ను ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు మహేశ్‌ భట్‌, పూజా భట్‌ల నిర్మాణ సంస్థలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా తీసుకున్నారు. వాళ్లు నిర్మించిన ‘జిస్మ్‌’ చిత్రంతో నా కెరీర్‌ ప్రారంభమైంది. చాలా తక్కువ బడ్జెట్‌తో... గొప్ప నాణ్యత కలిగిన సినిమాలు తీయాలన్నది వాళ్ల లక్ష్యం. కాబట్టి- ప్రొడక్షన్‌ తరపున నేనూ, నాకో ఇద్దరు సహాయకులు... మేం ముగ్గురమే మొత్తం సినిమా పనులు చూసేవాళ్లం. ఇది నేను తక్కువకాలంలోనే ఎక్కువ అనుభవాన్ని ఆర్జించేలా చేసింది.

ఓరోజు ఆ కంపెనీ తీసిన రెండో సినిమా ‘రోగ్‌’లోని ఓ పాటని దర్శకుడు ఎడిటింగ్‌ చేస్తున్నాడు. ఇంతలో ఆయనకి అర్జంటుగా రావాలంటూ ‘కాల్‌’ వచ్చింది. ఎటూ తేల్చుకోలేక నావైపు చూశాడు. ‘నేను చూసుకుంటాను మాస్టారూ... వెళ్లిరండి!’ అని చెప్పాను. ఆయన తటపటాయిస్తూనే వెళ్లాడు. ధైర్యంగానే ఆ పాటని ఎడిట్‌ చేయగలిగాను. ఆ తర్వాత అక్కడికి డ్యాన్స్‌ మాస్టర్‌ అహ్మద్‌ ఖాన్‌ వచ్చాడు. మామూలుగా తాను కొరియోగ్రఫీ చేసిన పాటకి ఎడిటింగ్‌లో ఏమాత్రం తేడా వచ్చినా ఒంటికాలిమీద లేస్తాడాయన. కాబట్టి... ఆయన ఏమంటాడా అని బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉండిపోయాను. పాట మొత్తం చూసిన అహ్మద్‌ఖాన్‌ నావైపు తిరిగి సూపర్బ్‌ అంటూ ‘థమ్స్‌ అప్‌’ చూపించాడు! నా పనిపైన నాకు ఆత్మవిశ్వాసాన్నిచ్చిన తొలి సంఘటన అది.

కష్టాలు మొదలు...

మహేశ్‌ భట్‌, పూజాభట్‌ల నిర్మాణ సంస్థలో మరో రెండేళ్లపాటు పనిచేశాక... ఇక బయటకు వచ్చి స్వతంత్రంగా సినిమాలు చేద్దామనుకున్నాను. ఆ కంపెనీలో నాకు ఏ కొదవా లేదు. నెల గడవగానే జీతం ఇచ్చేస్తుండేవారు. కానీ ఆ కంఫర్ట్‌ జోన్‌లో ఉండిపోతే ఎదిగే అవకాశమేదీ ఉండదు అనిపించింది. ఆ భద్రతని వదులుకుని రాలేకపోతే జీవితాంతం అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానే ఉండిపోతానని భయమేసింది. అందుకే ధైర్యంగా ముందుకు అడుగేశాను. కానీ వచ్చాకే తెలిసింది ‘సినిమా కష్టాలంటే’ ఏమిటో! జేబులోని డబ్బులు ఖాళీ అవుతున్నకొద్దీ ఇబ్బందులు మొదలయ్యాయి. ఇంకే పనిచేయడానికీ మనసొప్పలేదు. చాలామంది స్నేహితులు ‘అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వస్తావా పెద్ద అమౌంట్‌ ఇప్పిస్తాం!’ అని ఎన్నో ఆశలు కల్పించినా మొండిగా వద్దనేశాను. అలా కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఇంట్లోవాళ్లు ‘ఇక చాల్లే... వచ్చి ఇంకేదన్నా ఉద్యోగం చూసుకో’ అనలేదు, అండగా నిలిచారు.

అమ్మా, అన్నయ్యా, చెల్లీ నాపైన నాకు నమ్మకం సడలకుండా చూడగలిగారు. ఏదెలా ఉన్నా... మా కుటుంబం విషయంలో మాత్రం నేను అదృష్టవంతుణ్ణనే నమ్ముతున్నాను. వాళ్ల అండతోనే రెండేళ్లపాటు పోరాడాను. తర్వాత రామ్‌గోపాల్‌ వర్మ ఫ్యాక్టరీ తీసిన రెండు సినిమాలకి అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేశాను. అక్కడే నాకు ఛోటా కె.నాయుడు పరిచయమయ్యాడు. ఆయనతో ఓసారి మాట్లాడుతూ నేను రాసుకున్న ఓ కథ ‘వన్‌ లైన్‌’ చెప్పాను. దాన్ని ఆయన దిల్‌రాజుతో చెప్పడంతో, నన్ను కలవాలని కబురుపెట్టాడు. నా కథ దిల్‌రాజుకీ, ఆయన కజిన్‌ నిరంజన్‌రెడ్డికీ నచ్చింది. నిరంజన్‌తో నా స్నేహం కూడా అప్పుడే మొదలైంది. ఓ పెద్ద హీరోతో ఆ సినిమా మొదలుపెట్టడానికి సిద్ధమయ్యాం. కానీ... ఎందుకో తెలియదు ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఓ నిచ్చెన చివరి అంచుదాకా వెళ్లినట్లే వెళ్లి ‘దబ్‌’ మని కిందపడ్డట్టయింది నా పరిస్థితి.

అక్కడితో ఆగిపోలేదు...

ఆ ప్రాజెక్టు ఆగిపోయాక ముంబయి వచ్చి మరో కథ సిద్ధం చేసుకున్నాను. బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన ‘ఎ వెన్స్‌ డే’ నిర్మాత అంజుమ్‌ రిజ్వీకి కథ వినిపిస్తే దాన్ని నిర్మించడానికి ముందుకొచ్చాడు. హీరోగా ప్రఖ్యాత నటుడు నసీరుద్దీన్‌ షాని ఎంచుకున్నాను. వాణిజ్య విలువలూ, పాపులర్‌ సెంటిమెంట్లకి తావులేకుండా పూర్తిగా నేను కోరుకున్నట్టు ‘జాన్‌ డే’ సినిమా తీశాను. సినిమా రిలీజైన రోజే... ‘వేస్ట్‌’ అంటూ సమీక్షలు వచ్చేశాయి. ఇప్పుడైతే విమర్శకులు నా సినిమాని క్లాసిక్‌ అంటున్నారు కానీ... అప్పట్లో దానికి డబ్బులేవీ రాలేదు. ఓ దర్శకుడి తొలి సినిమా ఆ స్థాయిలో ఫ్లాపయితే ఇండస్ట్రీలో పలకరించేవాళ్లు ఎవరుంటారు! నా దగ్గరున్న కాస్త డబ్బులూ పోయాయి. అప్పులూ చేయాల్సి వచ్చింది. ఈసారి నిచ్చెన పై నుంచి కిందకి కాదు... ఏకంగా పాతాళంలోకి పడిపోయినట్లైంది.

తెలుగే ‘ఊపిరి’నిచ్చింది...

‘జాన్‌ డే’ ఫ్లాప్‌ తర్వాత నిస్పృహలో ఉన్న నన్ను తెలుగు పరిశ్రమే ఆదుకుంది. ‘ది ఇన్‌టచబుల్స్‌’ అనే ఫ్రెంచి సినిమాని తెలుగులోకి మార్చేందుకు అసోసియేట్‌ రైటర్‌గా రావాలంటూ నిరంజన్‌ రెడ్డి ద్వారా పీవీపీ సంస్థ వాళ్లు కబురంపారు. అలా దర్శకుడు వంశీపైడిపల్లితో కలిసి ఆ సినిమా కోసం పనిచేశాను. అదే నాగార్జున-కార్తీ కాంబినేషన్‌లో ‘ఊపిరి’గా వచ్చింది. ఆ చిత్రం విజయం నాకెంతో ఉత్సాహాన్నిచ్చింది. ఆ ఉత్సాహంతోనే ‘మహర్షి’ కథ రాశాను. అది వంశీపైడిపల్లికి బాగా నచ్చింది. మహేశ్‌బాబుని అప్రోచ్‌ అయితే ఆయనా అంగీకరించారు. కాకపోతే అది పట్టాలెక్కడానికి రెండేళ్లు పట్టింది.

ఈలోపు మళ్లీ హిందీలో దర్శకుడిగా ప్రయత్నాలు మొదలుపెట్టాను. రెండు అవకాశాలొచ్చాయి. ఒకదాంట్లో కథ సెట్స్‌లోకి వెళ్లడానికి కాస్త ముందు నిర్మాత చేతులెత్తేస్తే... ఇంకో కథని తీసుకున్న స్టుడియోనే మూతపడిపోయింది! సెంటిమెంట్లని అతిగా నమ్మే సినిమా రంగంలో ఓ కొత్త దర్శకుడికి ఇంతకన్నా పెద్ద పిడుగుపాట్లు ఏముంటాయి! ఆ నిస్పృహల నుంచి మళ్లీ తెలుగు సినిమాయే ఉత్సాహాన్ని నింపింది. మహేశ్‌బాబుతో ‘మహర్షి’ షూటింగ్‌ మొదలైంది. వంశీ నేనూ ఏడాదిపాటు పనిచేశాం. ఆ సినిమా రిలీజై... భారీ హిట్టు సాధించాకే తెలుగు పరిశ్రమకి ‘అహిసూర్‌ సాలమన్‌’ అంటే ఎవరో తెలిసింది!

నా హిస్టరీ తెలిసీ...

వరస వైఫల్యాలతో ఎంతగా తలబొప్పి కడుతున్నా... దర్శకుడిగా నా ప్రయత్నాలు మానలేదు. తెలుగులోనూ అవకాశాల కోసం చూడటం మొదలుపెట్టాను. అప్పుడే పత్రికలో చూసిన కొన్ని సంఘటనల ఆధారంగా ఓ కథ రాసి నిరంజన్‌రెడ్డికి చెప్పాను. రెండు నెలల తర్వాత తను కాల్‌ చేసి ‘ఈ కథ నాగార్జునతో చెబుతావా!’ అన్నారు. అంతకంటే కావాల్సిందేముంది కానీ... దర్శకుడిగా నా ‘హిస్టరీ’ తెలిసి ఆయన ఒప్పుకుంటారా అనే అనుమానం పీడించింది. సరే చూద్దామని వెళ్లి ‘లైన్‌’ చెప్పాను. దానికి ఆయన అదిరిపోయే సూచనలు కొన్ని చెప్పారు. మరో రెండు సిట్టింగ్స్‌ తర్వాత ‘మనం సినిమా చేస్తున్నాం!’ అని పచ్చజెండా ఊపారు. ఇంకేముంది... ఉత్సాహంగా గత డిసెంబర్‌ నుంచీ పనులు మొదలుపెట్టాను.

అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేయాలని పత్రికల క్లిప్పింగ్స్‌ల స్టైల్‌లో పోస్టర్‌లని విడుదలచేశాను! వాటికి అద్భుతమైన స్పందనొచ్చింది. ఈలోపు కరోనా లాక్‌డౌన్‌తో పనులు ఆపాల్సి వచ్చింది. నేను మళ్లీ డీలాపడ్డ మాట వాస్తవమేకానీ... నాగ్‌, నిరంజన్‌ నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూనే వచ్చారు. ఆగస్టు నుంచీ నాగ్‌తో షూటింగ్‌ మళ్లీ ప్రారంభించాం. ఆయన ఇన్వాల్వ్‌ అయ్యేకొద్దీ అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేసే ఎన్నో విషయాలు మా మనసుకి తడుతూనే ఉన్నాయి. అవి ఒక్కొక్కటిగా వస్తుంటాయి... వేచి చూడండి!

నేనెప్పుడూ నలుగురికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటూ ఉంటాను. ఒకరు- ఆ దేవుడు. ‘జాన్‌ డే’ సినిమా ఫ్లాపయినప్పుడు ‘అసలు నా జీవితంలో ఎందుకిలా జరుగుతున్నాయి... వీటి పర్పసేమిటీ?’ అని దాదాపు పిచ్చిపట్టినట్టు తయారయ్యాను. అందులో నుంచి నన్ను బయటపడేసింది భక్తిభావనే. నేను ధన్యవాదాలు చెప్పాల్సిన రెండో వ్యక్తి- నిర్మాత నిరంజన్‌ రెడ్డి. తన స్నేహమే లేకుంటే... తెలుగులోకి వచ్చేవాణ్ణే కాదు. మూడోవ్యక్తి- నాగార్జునగారు. అంతపెద్ద స్టార్‌ నా కథని విని ఒప్పుకోకపోయుంటే నా జీవితం ఇంకా సుడిగాడిలో చిక్కుకున్న ఎండుటాకులాగే ఉండేది.

చివరిగా - నా కుటుంబం. ఓ కుర్రాడు ఏళ్లు పైబడుతున్నా... జీవితంలో కుదురుకోక, పెళ్ళి పెటాకులేవీ లేకుండా ఉంటే చుట్టుపక్కల నుంచి ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో కదా. పక్కవాళ్ల సంగతి అలా పక్కనపెడితే లోలోపల వాళ్లకెంత అసంతృప్తి ఉంటుందో కదా! అవన్నీ తమలోనే దాచుకుని నన్ను కాచుకుంటూనే ఉన్నారు నా కుటుంబ సభ్యులు! ఇందుకోసం వాళ్లకి జీవితాంతం కృతజ్ఞతలు చెబుతూ ఉండాలి నేను.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.