ఈ ఏడాది విడుదలైన వెబ్‌సిరీస్‌ల్లో 'స్కామ్ 1992' సంచలన విజయం సాధించింది. ఐఎమ్‌డీబీ రేటింగ్స్‌లోనూ ఈ సిరీస్ అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. దీనివల్లే సోనీ లివ్ ఓటీటీ సబ్స్క్రైబర్లు అమాంతం పెరిగిపోయారు. అయితే.. ఇటీవల జరిగిన 'ఫిలింఫేర్ ఓటీటీ అవార్డుల్లో ఈ సిరీస్‌కు ఒక్క పురస్కారం కూడా దక్కకపోవడం అభిమానులను అసహనానికి గురిచేసింది. 'నిజమైన ప్రతిభను గుర్తించడంలో ఫిలింఫేర్ మరోసారి విఫలమైంది' అంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తాజాగా ఈ సిరీస్ దర్శకుడు హన్సల్ మెహతా వివరణ ఇచ్చారు.
-
Seeing many tweets echoing similar sentiments. #Scam1992 was released much after the cutoff date for this year’s #FilmfareOTTAwards. Hence it was not eligible for nomination. Our biggest award is the love we continue to receive from you. https://t.co/UA5kAZNWa4
— Hansal Mehta (@mehtahansal) December 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Seeing many tweets echoing similar sentiments. #Scam1992 was released much after the cutoff date for this year’s #FilmfareOTTAwards. Hence it was not eligible for nomination. Our biggest award is the love we continue to receive from you. https://t.co/UA5kAZNWa4
— Hansal Mehta (@mehtahansal) December 20, 2020Seeing many tweets echoing similar sentiments. #Scam1992 was released much after the cutoff date for this year’s #FilmfareOTTAwards. Hence it was not eligible for nomination. Our biggest award is the love we continue to receive from you. https://t.co/UA5kAZNWa4
— Hansal Mehta (@mehtahansal) December 20, 2020
"ఈ ఏడాది ఫిలింఫేర్ ఓటీటీ అవార్డ్స్ కట్ ఆఫ్ తేదీ తర్వాత.. మా సిరీస్ విడుదలైంది. అందుకే నామినేషన్‌కు అర్హత సాధించలేకపోయింది. మీ వద్ద నుంచి అందుతున్న ప్రేమే మాకు అతిపెద్ద పురస్కారం."
- హన్సల్ మెహతా, 'స్కామ్ 1992' వెబ్‌సిరీస్ దర్శకుడు.
స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా.. స్టాక్ మార్కెట్‌ను ఉన్నతస్థాయికి ఏ విధంగా తీసుకెళ్లాడు. అనంతర కాలంలో జరిగిన అతడి పతనమే ఈ స్కామ్ 1992 వెబ్ సిరీస్ కథాంశం. హర్షద్ జీవితానికి సంబంధించిన అంశాలను చూపించడంలో దర్శకుడు హన్సల్ మెహతా విజయం సాధించారు. హర్షద్ మెహతా పాత్ర పోషించిన ప్రతీక్ గాంధీ.. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకున్నారు.
ఇదీ చూడండి:తొలిసారి ఫిలింఫేర్ ఓటీటీ అవార్డుల ప్రదానం