ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్'లో భీమ్​ ముస్లిం గెటప్​ అందుకే..! - ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో

'ఆర్ఆర్ఆర్' సినిమా గురించి ఆసక్తికర విషయాల్ని రచయిత విజయేంద్రప్రసాద్ తెలిపారు. ఎన్టీఆర్, రామ్​చరణ్​ పాత్ర విశేషాల్ని వెల్లడించారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే?

why NTR as Komaram Bheem wore a skull cap in RRR?
ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్
author img

By

Published : Jul 22, 2021, 9:01 AM IST

'ఆర్ఆర్ఆర్'లోని కొమరం భీమ్​ పాత్ర ముస్లిం గెటప్​లో ఉన్న ఫొటో గతంలో రిలీజ్​ చేసినప్పుడు పెద్ద వివాదమైంది! పలువురు రాజకీయ నాయకులతో పాటు ముస్లిం సంఘాలు ఈ పోస్టర్​పై విమర్శలు చేశాయి. చరిత్రను వక్రీకరించి, భీమ్​ పాత్రను ముస్లింగా చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే ఈ రోల్​ సదరు గెటప్​ ఎందుకు వేయాల్సి వచ్చింది చిత్ర రచయిత విజయేంద్రప్రసాద్ వెల్లడించారు.

RRR
ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్

ముస్లిం టోపీ అందుకే..

నిజాం పోలీసులు తన​ కోసం గాలిస్తున్న సమయంలో, వారి నుంచి తప్పించుకునేందుకే కొమరం భీమ్ పాత్ర ముస్లిం టోపీ ధరిస్తుందని విజయేంద్రప్రసాద్ అన్నారు. సినిమాలో రామ్​చరణ్​ పోలీస్​గా ఎందుకు కనిపిస్తాడనే విషయం తెలిసిన తర్వాత ఆశ్చర్యపోతారని చెప్పారు.

వారిద్దరి కోసమే స్క్రిప్ట్

అయితే 'ఆర్ఆర్ఆర్' స్క్రిప్ట్​ను ఎన్టీఆర్, రామ్​చరణ్​ను దృష్టిలో పెట్టుకునే రాసినట్లు విజయేంద్రప్రసాద్ స్పష్టం చేశారు.

RRR
ఆర్ఆర్ఆర్ పోస్టర్

చెప్పిన తేదీకే రిలీజ్

చరిత్రకు కాస్త కల్పితం జోడించి 'ఆర్ఆర్ఆర్'ను తీస్తున్నారు. చరణ్​.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్.. కొమరం భీమ్​గా నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్ల భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరు 13న సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.