రజనీకాంత్ కథానాయకుడుగా నటించిన 'బాషా' సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. మాణిక్ బాషా పాత్రలో ఆయన తన నట విశ్వరూపం చూపించారు. ఈ చిత్రంలో రజనీ చెప్పిన 'ఈ బాషా ఒక్క సారి చెప్తే వందసార్లు చెప్పినట్లు' డైలాగ్ సినీ ప్రియుల్ని ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. ఆటో డ్రైవరైన బాషా గతంలో ఏం చేసేవాడు? అనే ఆసక్తికర కథాంశంతో దర్శకుడు సురేష్ కృష్ణ తీసిన ఈ చిత్రం అప్పట్లో ఓ సంచలనం.
1995లో విడుదలైన ఈ 'బాషా' సినిమాను మళ్లీ 2013లో తెలుగు, తమిళ భాషల్లో డిజిటల్ వెర్షన్‌లో రిలీజ్ చేశారు. ఇంతటి ప్రజాదరణ పొందిన ఈ చిత్రాన్ని హిందీలో అమితాబ్‌తో రీమేక్ చేసేందుకు నిర్మాత ప్రసాదరావు హక్కుల్ని దక్కించుకున్నారు. కానీ, బిగ్‌బీ ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటం, గతంలో ఆయన నటించిన 'హమ్' కథకు దీనికి పోలికలు ఉండటం వల్ల 'బాషా' రీమేక్ చేయలేదు.
ఇదీ చూడండి:రజనీకాంత్ మారువేషాలు వేసేది అందుకే!