రాజమౌళి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆయన తెరకెక్కించే సినిమాలు.. అందులోని ప్రతి సన్నివేశం ఓ అద్భుతం. ఆయన చిత్రాల్లోని ప్రతి ఫ్రేమూ ప్రేక్షకులను ఊహాలోకంలో విహరించేలా చేస్తాయి. అయితే.. జక్కన్న సినిమా తీసే క్రమంలో ఎలా ఆలోచిస్తారు?. ఇతరుల సలహాలు తీసుకుంటారా? లేదా? అనే పలు ఆసక్తికరమైన విషయాలు ఓ ఇంటర్యూలో పంచుకున్నారు.
ససేమిరా..
"నా సినిమా విజయవంతమవ్వడానికి కారణం నా రేషనాలిటీ. కథలో ఓ సన్నివేశం లేదా పాయింట్ గొప్పగా అనిపిస్తుంది. దాన్ని సెంట్రల్ ఐడియా అంటాం. కథను డెవలెప్ లేదా మేకింగ్ చేసేటప్పుడు ఓ సన్నివేశం తెరకెక్కించే విషయంలో నేను చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటా. ఎవరైనా వచ్చి ఆ సన్నివేశం మార్చాలని సలహా ఇస్తే అస్సలు ఒప్పుకోను. 'ఆ సీన్ ఎవరు చూడరు?', 'వర్కౌట్ అవ్వదు' అని అంటుంటారు. కానీ అవి పట్టించుకోను. ఒకవేళ ఏదైనా తేడాగా ఉందని నాకు అనిపిస్తే మాత్రం తప్పకుండా ఇతరుల సూచనలు తీసుకుంటా" అని తెలిపారు జక్కన్న.
రోల్‌మోడల్స్ ఎవరైనా ఉన్నారా?
"ప్రతి మనిషిలో పాజిటివ్, నెగిటివ్ రెండూ ఉంటాయి. అందుకే నాకు రోల్ మోడల్ అంటూ ఎవరూ లేరు" అని చెప్పారు రాజమౌళి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
జక్కన్న మగధీరకు 12 ఏళ్లు
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్-దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన 'మగధీర'.. అప్పట్లో బాక్సాఫీసు రికార్డులను తిరగరాసింది. కెరీర్లో రెండో సినిమాతోనే చరణ్‌కు స్టార్ హోదాను తెచ్చిపెట్టింది. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి నేటితో(జులై 31) 12 ఏళ్లు పూర్తయ్యింది.