అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సుశాంత్ సింగ్ చివరి చిత్రం 'దిల్ బెచారా' నేడు(జులై 24) ఓటీటీలో విడుదల కానుంది. సాయంత్రం 7:30 గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సెట్స్‌లో సుశాంత్ అల్లరికి సంబంధించిన విశేషాలతో రూపొందిన వీడియోను దర్శకుడు ముకేశ్ చబ్రా సోషల్ మీడియాలో పంచుకున్నారు. అతడితో తనకున్న అనుబంధాన్ని వెల్లడించారు. సుశాంత్‌ను 'హీరో' అని అభివర్ణించారు.
- View this post on Instagram
उसके बारे में था में बात करना बड़ा मुश्किल होता है ❤️ क्योंकि वो है साथ में ❤️
">
'దిల్ బెచారా' షూటింగ్ జరుగుతున్న సమయంలో తామిద్దరం(సుశాంత్, ముఖేశ్) సినిమాల గురించి చాలా మాట్లాడుకునేవాళ్లమని చెప్పిన ముకేశ్.. యాక్షన్‌లో ఉంటే సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు, కట్ చెబితే షారుక్ ఖాన్‌కు సుశాంత్ వీరాభిమాని అని వెల్లడించారు. జంషెడ్పుర్లో చిత్రీకరణ సందర్భంగా రోడ్డుపైనే షారుక్ పాటలకు సుశాంత్ డ్యాన్స్ చేసినట్లు తెలిపారు. ఈ వీడియోలో దానిని చూడొచ్చు.
![sushanth sajana dil bechara](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8151194_dil-bechara.jpg)
'దిల్ బెచారా'లో సుశాంత్, సంజనా సంఘీ జంటగా నటించారు. 2014లో వచ్చిన హాలీవుడ్ రొమాంటిక్ డ్రామా 'ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్'కు రీమేక్ ఇది. ఇద్దరు క్యాన్సర్ పేషెంట్ల మధ్య సాగే ప్రేమ కథతో సినిమాను రూపొందించారు. సైఫ్ అలీ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">