నటి, నిర్మాత మంచు లక్ష్మి.. తన అభిమాన హీరోకు పెళ్లి జరిగినప్పుడు తెగ ఏడ్చేసిందట. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమెనే స్వయంగా వెల్లడించింది.
తాను ఆమిర్‌ఖాన్‌కు వీరాభిమాని అని చెప్పిన లక్ష్మి.. ఒకానొక సమయంలో ఆయనను పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు తెలిపింది. తర్వాతి కాలంలో ఆమిర్‌కు రెండు సార్లు పెళ్లి జరిగినప్పుడు తాను బాగా ఏడ్చేశానని చెప్పింది. సినిమాల కోసం ఆయన కథలు ఎంచుకునే విధానం బాగుంటుందని వెల్లడించింది. టాలీవుడ్లో అయితే నాగార్జున అంటే చాలా ఇష్టమని పేర్కొంది.