ETV Bharat / sitara

మళ్లీ థియేటర్లు కళకళలాడాలంటే ఏం చేయాలి? - నాగ్ అశ్విన్ తాజా వార్తలు

లాక్​డౌన్ కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. కరోనా ప్రభావం తగ్గి ఒకవేళ తిరిగి థియేటర్లు ప్రారంభమైనా ప్రేక్షకులు వస్తారా?లేదా? అనే అనుమానులు రేకెత్తుతున్నాయి. అయితే తిరిగి థియేటర్లు కళకళలాడాలంటే ఏం చేయలంటూ నెటిజన్లను కోరారు దర్శకుడు నాగ్ అశ్విన్.

నాగ్
నాగ్
author img

By

Published : May 16, 2020, 12:02 PM IST

లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడ్డాయి. షూటింగ్‌లు నిలిచిపోయాయి. సినిమా విడుదలలూ ఆగిపోయాయి. ఫలితంగా సినీ పరిశ్రమకు భారీగా నష్టాలు వాటిల్లాయి. అయితే లాక్‌డౌన్‌ అనంతరం థియేటర్లను పునఃప్రారంభిస్తే ప్రేక్షకులు వస్తారా? రారా? అనే విషయంలో సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ట్విట్టర్‌ వేదికగా ఓ ట్వీట్‌ పెట్టారు. తిరిగి ప్రారంభించిన అనంతరం ప్రేక్షకులతో థియేటర్లు కళకళలాడాలంటే ఏం చేయాలి?అని నెటిజన్లను కోరారు.

"ప్రేక్షకులకు వైన్‌, బీర్‌ అందించే విధంగా థియేటర్లు కనుక లైసెన్స్‌ పొందితే సినిమా చూడడానికి వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందా అని ఓసారి సురేశ్‌బాబు, రానా నేను మాట్లాడుకున్నాం. ఇలా చేస్తే థియేటర్‌ వ్యాపారం మెరుగుపడుతుందా? అని చర్చించుకున్నాం. ఈ విషయంపై మీరు ఏం అనుకుంటున్నారు.. ఇది మంచి ఆలోచనా? లేదా చెడు ఆలోచనా?. ఏదీ ఏమైనా ఒకటి మాత్రం నిజం.. ఒకవేళ ఈ ఆలోచనే అమలు చేస్తే సినిమా చూడడానికి వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్‌ తగ్గిపోతారు. వైన్‌, బీర్‌ అందించే ఆలోచన కేవలం కొన్ని మల్టీప్లెక్స్‌లకు మాత్రమే పరిమితం కావొచ్చు. కానీ ఇది పూర్తి పరిష్కారం కాదు. లాక్‌డౌన్‌ తర్వాత థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య పెరగాలంటే ఏం చేస్తే బాగుంటుందో మీ అభిప్రాయాలు చెప్పండి. థియేటర్లు ఓపెన్‌ చేయగానే మీరు సినిమా చూడడానికి వస్తారా? లేదా ఇంకొంత కాలం వేచి చూస్తారా?’ అని నాగ్‌ అశ్విన్‌ నెటిజన్లను అడిగారు.

  • So true...it will keep the family audience away...can be an option at few multiplexes maybe, but not a solution...wat do u think theaters need to do to get ppl back? to increase audience...will you come back as soon as theaters open or wait & watch for a few weeks before going?

    — Nag Ashwin (@nagashwin7) May 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.