మౌర్య చక్రవర్తి చంద్రగుప్త మౌర్యపై సినిమా నిర్మించాలన్న కోరికను వ్యక్తపరిచింది బాలీవుడ్ క్వీన్ కంగనారనౌత్. సినీ పరిశ్రమ.. చరిత్రకు తగిన న్యాయం చేయలేదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. జాతీయ అవార్డు విజేతలతో ఓ హిందీ వార్త పత్రిక ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంగళవారం ఆమె హాజరైంది. అందులో భాగంగా భోజ్‌పురీ నటుడు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది.
రవికిషన్:- బిహార్‌తో మీకున్న అనుబంధమేంటి?
కంగనా:- చివరిసారిగా నా చిన్నతనంలో వచ్చాను. ఇది రెండోసారి. నాకు యోగా నేర్పించిన గురువు ఇక్కడివారే.
రవికిషన్:- ఇప్పటికే మణికర్ణిక లాంటి చారిత్రక సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అదే విధంగా బిహార్‌తో అనుబంధం ఉన్న ఏదైనా చారిత్రక నేపథ్య చిత్రాన్ని నిర్మించే అలోచనలు ఉన్నాయా?
కంగనా:- చరిత్రకు సినీపరిశ్రమ తగిన న్యాయం చేయలేకపోయింది. భవిష్యత్తులో చంద్రగుప్తమౌర్యపై సినిమా చిత్రీకరించే అవకాశాలు ఉన్నాయి.
రవికిషన్:- కొంచెం బరువు పెరిగినట్టు ఉన్నారు?
కంగనా:- 'తలైవి' సినిమాలోని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పాత్ర కోసం బరువు పెరిగాను.
ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు రవికిషన్‌తో కలసి భోజ్‌పురీ పాటకు స్టెప్పులేసింది. ఈ భామ ప్రస్తుతం ఓ చిత్రనిర్మాణ సంస్థ ప్రారంభించనుందని ప్రచారం జరుగుతోంది. ఈ సంస్థ ద్వారా తెరకెక్కే మొదటి సినిమా అయోధ్య రామ మందిర నేపథ్యంలో ఉంటుందని సమాచారం. త్వరలోనే కంగనా నటించిన క్రీడానేపథ్య చిత్రం 'పంగా' విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇదీ చూడండి.. అల్లు అర్జున్ ఇంట విషాదం.. 'ఏఏ20' నిర్మాత మృతి