విశ్వక్ సేన్ హీరోగా, దర్శకుడు విద్యాసాగర్ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ సమర్పణలో ఎస్.వి.సి.సి. డిజిటల్ పతాకంపై బాపినీడు, సుధీర్ ఈదర నిర్మిస్తున్నారు. శుక్రవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించి, టైటిల్‌ని విడుదల చేశారు. ఈ సినిమాకి 'అశోకవనంలో అర్జున కళ్యాణం' పేరు ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ని పంచుకుంది చిత్రబృందం.
కథానాయకుడిగా విశ్వక్ నటిస్తోన్న 7వ సినిమా ఇది. రవి కిరణ్ కోలా కథ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జయ ఫణి కృష్ణ, కూర్పు: విప్లవ్ నైషదం, ఛాయాగ్రహణం: పవిత్రన్. నాయిక వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. అలాగే 'పాగల్' చిత్రంలో నటిస్తున్నాడు విశ్వక్. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.