నటుడిగా కెరీర్ ప్రారంభించిన నాటి నుంచి మాస్ సినిమాల్లో నటిస్తూ 'మాస్ కా బాప్'గా పేరు తెచ్చుకున్నాడు విశ్వక్‌సేన్. మొదటిసారి ఇతడు పూర్తిస్థాయి లవర్‌బాయ్ పాత్రలో నటించిన చిత్రం 'పాగల్'. శనివారం (ఆగస్టు 14) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి సినీ ప్రియులను ఉద్దేశిస్తూ ఓ లేఖ రాశారు. తమ ప్రయత్నంలో ఏమైనా తప్పులుంటే విమర్శించమని తెలిపాడు. సినిమా థియేటర్స్‌ని కాపాడమని పేర్కొన్నాడు.
"నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతదూరం వచ్చిన నన్ను.. ఇప్పుడు నేను నటించిన 'పాగల్' సినిమాను ఆదరిస్తారనీ.. సెకండ్ వేవ్ తర్వాత మళ్లీ తెరిచిన సినిమా థియేటర్లను నిలబెడతారని కోరుకుంటున్నా. మా ప్రయత్నంలో మీకు ఏదైనా చిన్న లోపం అనిపిస్తే.. విమర్శించండి. కానీ, దయచేసి దాడి చేయకండి. తట్టుకునే శక్తి ఉన్నా లేకపోయినా ఎన్నో వేల మందికి ఉపాధి కలిగించే సినిమా థియేటర్స్‌ని కాపాడండి. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన నాకు మీరే అండ.. దండ..!" అని విశ్వక్ చెప్పుకొచ్చాడు.
నరేశ్ కొప్పిలి దర్శకత్వం వహించిన 'పాగల్'లో విశ్వక్.. ప్రేమ్ అనే కుర్రాడి పాత్రలో కనిపించనున్నాడు విశ్వక్. చనిపోయిన తన తల్లి ప్రేమను పంచే అమ్మాయి కోసం వెతికే అబ్బాయిగా ఇతడి పాత్ర ఉంటుంది. సిమ్రన్, నివేదా పేతురాజు కథానాయికలు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. రాహుల్ రామకృష్ణ, మహేశ్, మురళీ శర్మ కీలకపాత్రలు పోషించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: Vishwak sen Paagal: 'సినిమా చూసిన తర్వాతే అలా మాట్లాడా'