ETV Bharat / sitara

అన్న చెల్లెళ్లుగా మంచు విష్ణు, కాజల్​! - కాజల్​ అగర్వాల్​

ఐటీ కుంభకోణం కథతో 'మోసగాళ్లు' సినిమా తీస్తున్నారు. ఇందులో మంచు విష్ణు, కాజల్​ తోబుట్టువుల్లా తెరపై కనిపించనున్నారు.

Vishnu Manchu And Kajal Aggarwal Acting as siblings in Mosagallu Movie
ఆ సినిమాలో తోబుట్టువుల్లా మంచు విష్ణు, కాజల్​!
author img

By

Published : Aug 4, 2020, 7:53 AM IST

Updated : Aug 4, 2020, 8:35 AM IST

కథానాయకుడు మంచు విష్ణు, కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ 'మోసగాళ్లు' సినిమాలో తోబుట్టువులుగా కనిపించబోతున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా చిత్రబృందం ఈ విషయాన్ని వెల్లడిస్తూ, సోమవారం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

చరిత్రలో నమోదైన అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో హాలీవుడ్‌-ఇండియన్‌ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లాస్‌ ఏంజెల్స్​‌కు చెందిన జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 24 ఫ్రేమ్స్‌ఫ్యాక్టరీ పతాకంపై విష్ణు నిర్మిస్తుండగా, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. హాలీవుడ్​కు చెందిన షెల్డన్​ చౌ ఛాయాగ్రాహకుడుగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం కాజల్​ ప్రత్యేక వర్క్​షాప్​కు కూడా హాజరైంది. ఈ సినిమానూ వేసవిలోనే విడుదల చేయాలని భావించినప్పటికీ, లాక్​డౌన్​ కారణంగా అది కాస్త వాయిదా పడింది.

Last Updated : Aug 4, 2020, 8:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.