Vishal Enemy movie Ott release: తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న నటుడు విశాల్. ఆర్యతో కలిసి ఆయన నటించిన చిత్రం 'ఎనిమి'. ఆనంద్ శంకర్ దర్శకుడు. మిని స్టూడియోస్ పతాకంపై ఎస్.వినోద్ కుమార్ నిర్మించారు. మృణాళిని రవి కథానాయిక. మమతా మోహన్ దాస్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. దీపావళి సందర్భంగా గత నవంబరు 4న తమిళ/తెలుగు భాషల్లో విడుదలైంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. 'ఎనిమి' ఓటీటీ రైట్స్‌ను సోనీలివ్ దక్కించుకుంది. ఫిబ్రవరి నెలలో ఈ సినిమా తెలుగు/తమిళ భాషల్లో సోనీలివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మిత్రులుగా ఉన్న విశాల్, ఆర్యలు ఎందుకు శత్రువులుగా మారాల్సి వచ్చింది? ఇద్దరి మధ్య జరిగే పోరులో పై చేయి ఎవరిది? అన్నది తెరపైనే చూడాలి. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
డిలిటెడ్ సీన్
Shyamsingha roy movie deleted scene: నాని ద్విపాత్రాభినయంలో నటించి మెప్పించిన చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో హిట్ టాక్ అందుకున్న ఈ సినిమా తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల దృష్టిని మరింత ఆకర్షించడానికి ‘శ్యామ్ సింగరాయ్’ టీమ్ సిద్ధమైంది. నిడివి, ఇతర కారణాల వల్ల సినిమా నుంచి తొలగించిన పలు సన్నివేశాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. తాజాగా ‘వాసు రీకలెక్షన్ శ్యామ్’ పేరుతో విడుదల చేసిన వీడియో భావోద్వేగంతో సాగింది. వాసుగా తిరిగి జన్మించిన శ్యామ్ సింగరాయ్ కోల్‌కతా వెళ్లి అక్కడి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్న వీడియో ఆద్యంతం అలరిస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి:
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!