కోలీవుడ్ హీరోలు విశాల్, ఆర్య కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీలో శుక్రవారం నుంచి షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా చిత్రబృందం వెల్లడించింది.
- — Arya (@arya_offl) October 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
— Arya (@arya_offl) October 16, 2020
">— Arya (@arya_offl) October 16, 2020
ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. ఇతర తారాగణం వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
విశాల్‌కు ఇది 30వ చిత్రం, ఆర్యకు 32వ సినిమా. గతంలో వీరిద్దరూ 'వాడు వీడు'లో కలిసి నటించి, మెప్పించారు. మరి ఈసారి ఎలా అలరిస్తారో చూడాలి?