ETV Bharat / sitara

వైరస్‌ల ముప్పును ఆవిష్కరించిన సినిమాలెన్నో! - వైరస్‌-2019

కరోనా ప్రపంచ వ్యాప్తంగా అందరిని వణికిస్తోంది. అయితే వైరస్ విజృంభించినప్పుడు ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయనే దానిపై ముందుగానే చూపించారు పలువురు చిత్ర దర్శకులు. మరి అలాంటి చిత్రాలపై ఓ లుక్కేద్దాం!

Viruses and Similar Threats movies
వైరస్‌ల ముప్పును ఆవిష్కరించిన సినిమాలెన్నో!!
author img

By

Published : Apr 15, 2020, 8:14 AM IST

మానవాళికి ఇప్పుడున్న శత్రువు కరోనా వైరస్‌ ఒక్కటే. దానికి రాజు, పేద అనే భేదం లేదు. అందరినీ దెబ్బతీస్తుంది. కలసికట్టుగా పోరాడితేనే మహమ్మారిపై విజయం సాధించగలమనే ఇతివృత్తంగా ప్రపంచంలో అనేక సినిమాలు వచ్చాయి. వైరస్‌ల వల్ల ఎలాంటి ప్రమాదాలు పొంచిఉన్నాయో కళ్లకు కట్టినట్టు చూపాయి. అన్ని చిత్రాల సందేశం ఒక్కటే. అంటువ్యాధులు మనలో మనల్నే శత్రువులుగా మారుస్తాయి. భౌతిక దూరం పాటించేలా హితబోధ చేస్తాయి. మనల్నందరినీ ఒక్కటిగా కూడా చేస్తాయి. జట్టుగా సమన్వయంతో పోరాడితేనే విజయం సాధించగలవని పలు సినిమాలు చూపించాయి. ఐ యామ్‌ లెజెండ్‌, ట్రైన్‌ టు బుసాన్‌, ఇట్‌ కమ్స్‌ ఎట్‌ నైట్‌, డాన్‌ ఆఫ్‌ డెడ్‌, ద పెయింటెడ్‌ వేల్‌, ద హ్యాపెనింగ్‌, క్వారంటైన్‌, డూమ్స్‌ డే, మ్యాగీ వంటి సినిమాలెన్నో ఉన్నాయి. అయితే వీటిలో హింస మోతాదు ఎక్కువగా ఉంది. హింస ప్రధానాంశంగా లేని అలాంటి సినిమాల్లో కొన్ని..

కంటైజన్‌-2011

Viruses and Similar Threats movies
కంటైజన్‌-2011

స్పర్శ ద్వారా వైరస్‌ ఎలా వ్యాపిస్తుందో చూపుతుందీ చిత్రం. చైనా నుంచి అమెరికాకు వచ్చిన వ్యక్తితో ఉపద్రవం మొదలవుతుంది. విపత్తు వేళ పరిస్థితుల్ని చూపించారు.

చిల్డ్రన్‌ ఆఫ్‌ మెన్‌-2006

Viruses and Similar Threats movies
చిల్డ్రన్‌ ఆఫ్‌ మెన్‌-2006

వైరస్‌తో మహిళల్లో వంధ్యత్వం రావడంతో ప్రపంచం పతనం అంచుకు చేరుతుంది. ఈ పరిస్థితుల్లో గర్భవతి అయిన యువతిని దుండగుల మధ్య నుంచి భద్రమైన చోటుకు తీసుకెళ్లడమే కథ.

28 డేస్‌ లేటర్‌-2002

Viruses and Similar Threats movies
28 డేస్‌ లేటర్‌-2002

కోతుల నుంచి వచ్చిన ప్రమాదకర అంటువ్యాధితో సమాజం ఎలా విచ్ఛిన్నం అయ్యిందో ఉత్కంఠ రేకెత్తేలా చూపారు.

బ్లైండ్‌నెస్‌-2008

Viruses and Similar Threats movies
బ్లైండ్‌నెస్‌-2008

కంటి ఇన్‌ఫెక్షన్‌తో ఒక్కొక్కరుగా చూపు కోల్పోతున్న వైనం, ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు ఓ మహిళ చేసిన త్యాగాలను చూపిందీ చిత్రం.

వైరస్‌-2019

Viruses and Similar Threats movies
వైరస్‌-2019

వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన మలయాళీ చిత్రం ‘వైరస్‌’. 2018లో కేరళలో ప్రబలిన నిపా వైరస్సే కథాంశం. అత్యవసర వేళ ప్రభుత్వం, ప్రజారోగ్య వ్యవస్థ ఎలా స్పందించాలో చెప్పింది.

అవుట్‌బ్రేక్‌-1995

Viruses and Similar Threats movies
అవుట్‌బ్రేక్‌-1995

అమెరికాలోకి మరో ఖండం నుంచి తీసుకొచ్చిన కోతి ద్వారా వ్యాపించిన వైరస్‌ ఒక పట్టణాన్ని అతలాకుతలం చేస్తుంది. వైద్యులు, సైనికులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.