రానా దగ్గుబాటి(Rana New Movie), సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన 'విరాటపర్వం'(Virata Parvam OTT Release) చిత్రం ఓటీటీలో విడుదలపై జరుగుతున్న ప్రచారాన్ని ఆ చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల ఖండించారు. 'విరాటపర్వం' సినిమాను తప్పకుండా థియేటర్‌లోనే విడుదల చేస్తామని మరోమారు స్పష్టం చేశారు. సినిమాకు మంచి డిమాండ్ వచ్చిందని, దీంతో ఓటీటీకి విక్రయించారన్న వార్తల్లో నిజం లేదని తెలిపిన వేణు.. థియేటర్లలోనే ప్రేక్షకుల రద్దీని బట్టి విడుదల చేస్తామని తెలిపారు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తామని వెల్లడించారు.
![Virata Parvam Director Udugula Venu Clarifies on Movie OTT Releasing Rumours](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12517436_virata-parvam.jpg)
రానా, సాయిపల్లవికి సంబంధించిన సన్నివేశాలు మరో నాలుగు రోజులు చిత్రీకరణ చేయాల్సి ఉందని, ఆ సన్నాహాల్లో ఉన్నట్లు తెలిపారు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్వీ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. 1990లో మావోయిస్టు ఉద్యమంలోని పలు యథార్థ సంఘటనల ఆధారంగా వేణు విరాటపర్వాన్ని తీర్చిదిద్దారు. దగ్గుబాటి సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మాతలు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 30న ఈ సినిమా విడుదల కావాల్సివుండగా, కొవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా వాయిదా పడింది.
ఇదీ చూడండి.. OTT movies: ఆ మూడు తెలుగు సినిమాలు ఓటీటీలో!