ETV Bharat / sitara

బాలీవుడ్​ సినిమాలో విరాట్​​ కోహ్లీ కనువిందు..! - cricket

ప్రముఖ నటీనటులు దుల్కర్​ సల్మాన్​, సోనమ్​ కపూర్​ జంటగా నటిస్తున్న చిత్రం 'జోయా ఫ్యాక్టర్​'. ఇందులో భారత జట్టు సారథి విరాట్​ కోహ్లీ పాత్రకు చెందిన ఓ వీడియో​ను విడుదల చేసింది చిత్రబృందం.

బాలీవుడ్​ సినిమాలో స్టార్​ కోహ్లీ కనువిందు..!
author img

By

Published : Sep 12, 2019, 12:24 PM IST

Updated : Sep 30, 2019, 7:57 AM IST

టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ ఓ బాలీవుడ్​ సినిమాలో కనిపించి ప్రేక్షకులను అలరించనున్నాడు. అయితే ఇందులో నటించింది నిజమైన కింగ్​ కోహ్లీ కాదు. విరాట్​ను పోలినట్లు ఉండే టిక్​టాక్​ స్టార్​ గౌరవ్​ అరోరా. ప్రముఖ నటీనటులు దుల్కర్​ సల్మాన్​, సోనమ్​ కపూర్​ జంటగా 'జోయా ఫ్యాక్టర్'​ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులోని కోహ్లీ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అభిషేక్‌ శర్మ దర్శకుడు. క్రికెట్‌ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. దుల్కర్‌ సల్మాన్ ప్రధాన పాత్ర పోషించాడు. అనుజా చౌహాన్ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. యాడ్​ ఏజెన్సీ ఏజెంట్​ అయిన జోయా... భారత క్రికెట్ జట్టును కలిసినప్పుడు ఎటువంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయనే అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది.

ఇటీవలే ఈ సినిమా ట్రైలర్​ విడుదలైంది. ధోనీ సారథ్యంలో భారత జట్టు ప్రపంచకప్(2011)​ గెలవడం ప్రధానాంశంగా రూపొందించారు. ఇప్పుడు ఈ ట్రైలర్​పై భారత క్రికెట్​ దిగ్గజం సచిన్​ తెందూల్కర్​ ప్రశంసలు కురిపించారు.

" ది జోయా ఫాక్టర్ ట్రైలర్‌ను చూశాను. నా స్నేహితుడు అనిల్‌ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్‌కు ఆల్ ది బెస్ట్ ".
-- సచిన్​ తెందూల్కర్​, భారత క్రికెట్​ దిగ్గజం

మాస్టర్​ ట్వీట్​కు దుల్కర్‌ సల్మాన్ ధన్యవాదాలు చెప్పాడు. సోనమ్ కపూర్ సంతోషం వ్యక్తం చేసింది. "ఓ మై గాడ్.. ధన్యవాదాలు సర్. ఇదంతా మీ ప్రేమ" అని బదులిచ్చింది. ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇదీ చూడండి...

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 30, 2019, 7:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.