భారత సారథి విరాట్ కోహ్లీకి, తనకి కొన్ని విషయాల్లో పోలికలు ఉన్నాయని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చెప్పింది. తాను, కోహ్లీ ఎక్కువ వివాదాలు ఎదుర్కొన్నామని, ఈ కారణంతోనే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్నామంది. ఈమె నటించిన 'పంగా'.. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా విరాట్ గురించి మాట్లాడిందీ నటి.
"నాకు, కోహ్లీకి కొన్ని విషయాల్లో పోలికలు ఉన్నాయని ఎంతో మంది చెబుతుంటారు. క్రికెట్‌లో అతడు గొప్ప పేరు సంపాదించాడు. అతడిని ఎంతో మంది ప్రేమిస్తారు. మా ఇద్దరి మధ్య ఓ పోలిక ఉంది. మేమిద్దరం ఎక్కువ వివాదాలు ఎదుర్కొన్నాం. ఈ కారణంగానే ఎక్కువ మంది అభిమానులను సంపాదించాం. కోహ్లీకి దూకుడు ఎక్కువ అని విమర్శిస్తుంటారు. నేనూ ఎంతో దూకుడుగా ఉంటాను. క్రీడాకారుడి జీవితం అంత సులువు కాదు. ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆట కోసం వారు తీవ్రంగా సాధన చేస్తారు. ఫిట్‌నెస్ కోసం ఎంతో శ్రమిస్తారు"
-కంగనా రనౌత్, బాలీవుడ్ హీరోయిన్
'పంగా' సినిమాలో కంగనా.. జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారిణిగా నటించింది. అశ్వినీ అయ్యర్ తివారి దర్శకత్వం వహించారు. శంకర్-ఎహసన్-లాయ్ సంగీతం అందించారు.
ఇవీ చూడండి.. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న నటి