*'విక్రమ్' ఫస్ట్‌లుక్ వచ్చేసింది. కమల్‌హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ముఖాలతో రూపొందించిన ఈ లుక్.. అదరగొట్టింది. ముగ్గురు విలక్షణ నటులు ఉండటం వల్ల అంచనాలు పెరిగిపోతున్నాయి. 'మాస్టర్' ఫేమ్ లోకేశ్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలోకి ఈ సినిమా వచ్చే అవకాశముంది.
*సినిమాలు, వెబ్ సిరీస్‌లతో నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఆహా.. త్వరలో కుకింగ్ షోతో మెప్పించేందుకు సిద్ధమవుతోంది. 'ఆహా భోజనంబు' పేరుతో త్వరలో ఈ షోను ప్రసారం చేయనుంది. మంచు లక్ష్మీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీలు వచ్చి వంట చేయనున్నారు!
*సాయితేజ్ 'రిపబ్లిక్' చిత్రం నుంచి తొలి లిరికల్ సాంగ్ వచ్చేసింది. 'గానా ఆఫ్ రిపబ్లిక్' టైటిల్‌తో వచ్చిన ఈ గీతం.. శ్రోతల్ని అలరిస్తోంది. ఈ సినిమాలో సాయితేజ్.. ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నారు. దేవాకట్టా దర్శకుడు. త్వరలో విడుదల తేదీపైనా స్పష్టత ఇవ్వనున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
*అదిత్, మేఘా ఆకాశ్ జంటగా నటించిన 'డియర్ మేఘ' ఆగస్టు 12న విడుదల కానుందని సమాచారం. అలానే కృతిసనన్ 'మీమీ' సినిమా.. జులై 30న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈనెల 13న ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఇవీ చదవండి: