ETV Bharat / sitara

'విజయ రాఘవన్' ట్రైలర్​.. బెల్​ బాటమ్ రిలీజ్ డేట్.. - విజయ రాఘవన్

కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. ఇందులో 'వరుడు కావలెను', 'విజయ రాఘవన్', ​'ద్వైత్వ', 'బెల్​ బాటమ్'​ చిత్రాలకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి.

vijaya raghavan
విజయ రాఘవన్
author img

By

Published : Aug 2, 2021, 10:30 PM IST

నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటిస్తున్న చిత్రం 'వరుడు కావలెను'. లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని 'దిగు దిగు దిగు నాగ' సాంగ్​ ప్రోమో సోమవారం విడుదలైంది. పూర్తి గీతం ఆగస్టు 4న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ట్రైలర్​ రిలీజ్..

తమిళ నటుడు విజయ్ ఆంటోని నటిస్తున్న 'విజయ రాఘవన్' సినిమా ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఆనంద్​ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్​గా ఆత్మిక కనిపించనుంది.

వెలకమ్​ త్రిషా..

dwitva
ద్వైత్వ చిత్రంలో త్రిషా

'కేజీఎఫ్​' లాంటి బ్లాక్​బాస్టర్​ తర్వాత హోంబళే నిర్మాణ సంస్థ.. వరుసగా సినిమాలు చేస్తోంది. ఇటీవల 'యువరత్న'తో ప్రేక్షకుల్ని అలరించింది. అందులో నటించిన కన్నడ పవర్​స్టార్​ పునీత్​ రాజ్​కుమార్.. మరోసారి ఈ సంస్థలోనే​ 'ద్వైత్వ' చిత్రం చేస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్​గా ఎంపికైంది. ఈ చిత్రానికి పవన్​ కుమార్​ దర్శకత్వం వహిస్తుండగా.. విజయ్​ కిరగందూర్​ నిర్మిస్తున్నారు.

సందడి అప్పటినుంచే..

అక్షయ్‌ కుమార్‌ 'బెల్ బాట‌మ్' విడుదలపై స్పష్టతనిచ్చేశారు. ఆగస్టు 19న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. అయితే ఈ సినిమా 2డీ, 3డీ ఫార్మాట్​లో రానుందని అక్షయ్ చెప్పారు. ఎం.తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వాణీ క‌పూర్‌, హ్యూమా ఖురేషీ, లారా దత్తా త‌దితరులు కీలక పాత్రలు పోషించారు.

ఇదీ చదవండి: 'ఆర్​ఆర్​ఆర్' దోస్తీ సాంగ్.. జపాన్​ అభిమానులు నిరాశ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.