ETV Bharat / sitara

హీరో కంటే సేతుపతికే ఎక్కువ రెమ్యునరేషన్! - విజయ్ సేతుపతి న్యూస్

తొలిసారి వెబ్ సిరీస్​లో నటిస్తున్న విజయ్ సేతుపతి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందుకోనున్నట్లు తెలుస్తోంది. అది కథానాయకుడికి ఇచ్చే దాని కంటే ఎక్కువని సమాచారం. ప్రస్తుతం ఈ సిరీస్ చిత్రీకరణ గోవాలో సాగుతోంది.

Vijay Sethupathi to get bigger paycheck than Shahid Kapoor for Raj & DK's web series?
విజయ్ సేతుపతి షాహిద్ కపూర్
author img

By

Published : Feb 3, 2021, 1:42 PM IST

ఉత్తరాది, దక్షిణాది తేడా లేకుండా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు తమిళ నటుడు విజయ్ సేతుపతి. ఇటీవల వచ్చిన 'మాస్టర్'లో ప్రతినాయకుడిగా ఆకట్టుకున్న ఇతడు.. 'ద ఫ్యామిలీ మ్యాన్' ఫేమ్ రాజ్-డీకే దర్శకత్వం వహిస్తున్న ఓ వెబ్ సిరీస్​లో కీలక పాత్ర పోషిస్తున్నారు. గోవాలో షూటింగ్ జరుగుతోంది.

Shahid Kapoor with Raj & DK
దర్శక ద్వయంతో హీరో షాహిద్ కపూర్

అయితే ఈ సిరీస్​ కోసం సేతుపతి, హీరో కంటే ఎక్కువ రెమ్యునరేషన్​ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సినీ వర్గాల్లో ప్రస్తుతం ఈ వార్త చర్చనీయాంశమైంది.

ఈ వెబ్ సిరీస్​తోనే బాలీవుడ్​ నటుడు షాహిద్ కపూర్ తొలిసారి డిజిటల్​ ఎంట్రీ ఇస్తున్నారు. రాశీఖన్నా హీరోయిన్​గా నటిస్తోంది. అయితే ఈ సిరీస్​ కోసం షాహిద్.. దాదాపు రూ.40 కోట్లు తీసుకుంటున్నారట. తొలి సీజన్​ హిట్ అయితే రెండో సీజన్​ తీసే అవకాశమున్న నేపథ్యంలోనే నిర్మాతలు అతడికి ఇంత మొత్తం చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.

Shahid Kapoor, rashi khanna
షాహిద్ కపూర్, రాశీఖన్నా

ఇందులోనే నటిస్తున్న విజయ్ సేతుపతికి రూ.55 కోట్ల మేర నిర్మాతలు ఇస్తున్నారు! ఈ ఏడాది చివర్లో లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో​ ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.