ETV Bharat / sitara

తెలుగులో విడుదల కానున్న విజయ్​ మలయాళ సినిమా - Vijay sethupathi marconi mathay movie in telugu

మలయాళంలో సూపర్​హిట్​గా నిలిచిన 'మార్కొని మతాయ్'.. తెలుగులో 'రేడియో మాధవ్' పేరుతో విడుదల కానుంది. ఇందులో తమిళ నటుడు విజయ్ సేతుపతి, జయరామ్ హీరోలుగా నటించారు. ఈ చిత్ర పోస్టర్​ను యువ కథానాయకుడు శ్రీవిష్ణు విడుదల చేశాడు.

Vijay
విజయ్​
author img

By

Published : Oct 7, 2020, 8:45 PM IST

తమిళ నటుడు విజయ్ సేతుపతి, జయరామ్ హీరోలుగా నటించిన మలయాళ సినిమా 'మార్కొని మతాయ్'. సనల్ కలతిల్ దర్శకత్వం వహించారు. కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా అక్కడ మంచి విజయం సాధించింది. ఇప్పుడీ సినిమా తెలుగులో 'రేడియో మాధవ్' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

విజయ్ సేతుపతి నటించిన తొలి మలయాళ సినిమా ఇదే కావడం విశేషం. లక్ష్మి చెన్నకేశవ ఫిల్మ్స్ పతాకంపై కృష్ణస్వామి నిర్మించిన ఈ చిత్ర పోస్టర్​ను యువ కథానాయకుడు శ్రీవిష్ణు విడుదల చేశాడు. ఈ సినిమా తెలుగులో విడుదలవుతుండటం పట్ల హర్షం వ్యక్తం చేసిన శ్రీవిష్ణు... మంచి విజయం సాధించాలని ఆకాంక్షించాడు.

ఇదీ చూడండి జైలు నుంచి విడుదలైన రియా చక్రవర్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.