ETV Bharat / sitara

వంటల ప్రోగ్రామ్​ హోస్ట్​గా విజయ్ సేతుపతి! - Vijay Sethupathi movie news

సినిమాలు, వెబ్​ సిరీస్​ల్లో నటిస్తూ బిజీగా ఉన్న విజయ్ సేతుపతి.. టీవీ తెరపై మరో కొత్త షోతో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారట. రానున్న వేసవిలో ప్రసారం కాబోయే ఈ ప్రోగ్రామ్​ కోసం భారీగా రెమ్యునరేషన్​ తీసుకోనున్నారని సమాచారం.

Vijay Sethupathi in 'Cooku With Comali' like TV show?
వంటల ప్రోగ్రామ్​ హోస్ట్​గా విజయ్ సేతుపతి!
author img

By

Published : Mar 18, 2021, 5:31 AM IST

విజయ్ సేతుపతి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోని సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న నటుడు ఈయన. దీంతో పాటే వెబ్ సిరీస్​లు, షార్ట్ ఫిల్మ్స్​లో కీలక పాత్రలు పోషిస్తూ సందడి చేస్తున్నారు.

ఇప్పుడు తమిళంలో 'కుకు విత్ కోమలి' షోకు కొనసాగింపుగా రానున్న ఓ వంటల ప్రోగ్రామ్​కు వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు విజయ్ అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఇందుకోసం ఆయనకు భారీ మొత్తం ఇచ్చే ఆలోచనలో నిర్వహకులు ఉన్నారట.

ఇప్పటికే ప్రముఖ తమిళ ఛానెల్​లో 'నమ్మ ఒరు హీరో' షోకు హోస్ట్​గా వ్యవహరిస్తున్నారు విజయ్. ఇది అత్యధిక టీఆర్పీ రేటింగ్​లు దక్కించుకుని, ప్రేక్షకుల్ని అలరిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.