ETV Bharat / sitara

విజయ్​కు ముద్దుపెట్టిన మరో తమిళ హీరో - మాస్టర్ సినిమా

'మాస్టర్' చిత్రబృందం చేసుకున్న ఓ వేడుకలో హీరో విజయ్​కు ముద్దివ్వడం సహ హగ్​ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు సహ నటుడు విజయ్ సేతుపతి. ఏప్రిల్​లో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

విజయ్​కు ముద్దుపెట్టిన మరో తమిళ హీరో
హీరో విజయ్
author img

By

Published : Feb 19, 2020, 6:47 AM IST

Updated : Mar 1, 2020, 7:23 PM IST

కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతిని అభిమానులు ముద్దుగా 'మక్కల్ సెల్వన్' అని పిలుస్తుంటారు. అందుకు కారణం అతడికి అభిమానులు, సహ నటులపై చాలా గౌరవం ఉండటం. ఇది చాలా సందర్భాల్లో నిరూపితం అయింది. ప్రస్తుతం ఇతడు 'మాస్టర్' సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్​లో హీరో విజయ్​కు అనుకోని సర్​ప్రైజ్​ ఇచ్చాడీ నటుడు. ఆశ్చర్యపోవడం యూనిట్ వంతైంది.

vijay sethupathi vijay
విజయ్ సేతుపతి-హీరో విజయ్

తన అభిమానులకు కేవలం ఫొటోలే కాకుండా బుగ్గపై ముద్దు, హగ్​(కౌగిలింత) ఇస్తుంటాడు విజయ్ సేతుపతి. ఈ విషయమై ఓసారి ఇతడిని జోక్​గా అడిగిన హీరో విజయ్.. తనకు ఓ ముద్దివ్వాలని అన్నాడు. దానిని ఇటీవలే గుర్తు చేసుకున్న విజయ్ సేతుపతి.. యూనిట్ సభ్యుడి పుట్టినరోజు వేడుకలో హీరో విజయ్​కు హఠాత్తుగా బుగ్గపై ముద్దుపెట్టడం సహా హగ్ ఇచ్చాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోలు ఇంతవరకు బయటకు రాలేదు.

'మాస్టర్'కు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. ఏజీఎస్ సినిమాస్ నిర్మిస్తోంది. ఈ ఏప్రిల్​లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Mar 1, 2020, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.