కోలీవుడ్ యాక్టర్ విజయ్‌సేతుపతి అభిమానుల పట్ల బాగా ప్రేమ చూపిస్తాడు. ఎంతగా అంటే ఫ్యాన్ అడిగితే ముద్దు కూడా పెట్టేంతగా. ప్రస్తుతం ఈ వీడియో నెటింట వైరల్ అవుతోంది.
- తన అభిమాన హీరోని కలవడానికి కష్టపడి వస్తాడో యువకుడు. కుర్రాడితో కలిసి ఫొటో దిగుతాడు సేతుపతి. అక్కడితో ఆగని ఆ యువకుడు ముద్దు పెట్టమంటే ఏ మాత్రం చికాకు పడకుండా ఆ కోరికనూ తీరుస్తాడీ 96 హీరో. అంతేకాకుండా అభిమాని ముద్దు పెట్టినా... అంతే ఆప్యాయంగా ఆ చుంబనాన్ని స్వీకరించాడు. ఆదరణ పెరుగుతున్నా అభిమానులతో సాధారణ వ్యక్తిలాగే వ్యవహరించడం మరింత ఆకట్టుకుటోంది.
#Vijaysethupathi love for his fans.👌😍😁@VijaySethuOffl #MakkalSelvan pic.twitter.com/oUsY5ccar9
— Suresh Kondi (@V6_Suresh) March 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#Vijaysethupathi love for his fans.👌😍😁@VijaySethuOffl #MakkalSelvan pic.twitter.com/oUsY5ccar9
— Suresh Kondi (@V6_Suresh) March 12, 2019#Vijaysethupathi love for his fans.👌😍😁@VijaySethuOffl #MakkalSelvan pic.twitter.com/oUsY5ccar9
— Suresh Kondi (@V6_Suresh) March 12, 2019
ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న విజయ్...త్వరలో తెలుగు తెరపై కనువిందు చేయనున్నాడు. చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రంలో రాజా పాండీ అనే కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఎలాంటి ఆడంబారాలు లేకుండా తన సహజ నటనతో ఎక్కువ మంది ప్రేక్షకుల మన్ననలు పొందాడీ విక్రమవేద.
- ఇవీ చూడండి-->మరింత అందంగారాశీఖన్నా..!