విభిన్న కథా చిత్రాలతోపాటు అద్భుత నటనతో ప్రేక్షకులని తన వైపు తిప్పుకున్న హీరో ఆమిర్ ఖాన్. విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్న కథానాయకుడు విజయ్ సేతుపతి. వీరిద్దరూ కలిసి నటించబోతున్నారు. ఈ విషయాన్ని విజయే స్వయంగా తెలిపాడు. ఆస్ట్రేలియా మెల్బోర్న్లో జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్(ఐఎఫ్ఎఫ్ఎమ్)కు హాజరైన ఈ తమిళ నటుడు ఆమిర్ ఖాన్‌తో కలిసి పనిచేయనున్న విషయాన్ని ఖరారు చేశాడు.
"ఈ విషయంపై ఇద్దరం(ఆమిర్, విజయ్ సేతుపతి) మాట్లాడుకున్నాం. సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియజేస్తాం" - విజయ్ సేతుపతి, తమిళ నటుడు.
అమితాబ్ బచ్చన్, షారుఖ్‌కు వీరాభిమానినని చెప్పాడు విజయ్ సేతుపతి.
"అమితాబ్ బచ్చన్ నా ఫేవరెట్ హీరో. ఆయన సినిమాలు చాలా చూశాను. ఇటీవల వచ్చిన పింక్ సినిమానూ వీక్షించా. షారుఖ్ అంటే కూడా నాకు చాలా ఇష్టం" -విజయ్ సేతుపతి, తమిళ నటుడు.
సూపర్ డీలక్స్ చిత్రానికి ఐఎఫ్ఎఫ్ఎమ్ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందుకున్నాడు విజయ్ సేతుపతి. ఈ వేడుకకు షారుక్ ఖాన్ కూడా హాజరయ్యాడు. ఆగస్టు 9న ప్రారంభమైన ఐఎఫ్ఎఫ్ఎమ్ ఈ నెల17 వరకు జరగనుంది. భారత ఉపఖండం నుంచి 22 భాషల్లో 60 చిత్రాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.
ఇది చదవండి: 'ప్రేమించా.. మోసపోయా.. పుస్తకం రాశా'