ETV Bharat / sitara

కాస్ట్యూమ్​ నచ్చక షూటింగ్​కు రాని హీరో విజయ్! - కాస్ట్యూమ్​ నచ్చక షూటింగ్​కు రాని విజయ్!

గతంలో 'చంద్రలేఖ' షూటింగ్​ సందర్భంగా జరిగిన ఆసక్తికర విషయాన్ని చెప్పింది నటి వనిత విజయ్ కుమార్. కాస్ట్యూమ్​ నచ్చక, సెట్​లో చిత్రీకరణకు విజయ్ రాలేదని తెలిపింది.

కాస్ట్యూమ్​ నచ్చక షూటింగ్​కు రాని విజయ్!
తమిళ హీరో విజయ్
author img

By

Published : Jun 11, 2020, 8:31 AM IST

తమిళ స్టార్ హీరో తళపతి విజయ్​ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోట్లమంది అభిమానులు అతడి సొంతం. అలాంటిది ఈ కథానాయకుడు ఓసారి, తన కాస్ట్యూమ్​ నచ్చలేదని పాట షూటింగ్​కు హాజరు కాలేదట. ఈ విషయాన్ని నటి వనిత విజయ్ కుమార్​ వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీనిని పంచుకుంది.

"చంద్రలేఖ'(1995) సినిమా షూటింగ్​లో 'అల్లా ఉన్ ఆనై' పాట చిత్రీకరణ జరుగుతోంది. ఆ సమయంలో విజయ్​కు ఇచ్చిన కాస్ట్యూమ్​ నచ్చలేదు. దీంతో అతడు షూటింగ్​కు హాజరయ్యేందుకు ఇష్టపడలేదు. అప్పట్లో డిజైనర్స్ లేకపోవడం వల్ల మా బట్టలు కాస్ట్యూమర్సే కుట్టేవారు" -వనిత విజయ్ కుమార్, నటి

విజయ్​ ప్రస్తుతం 'మాస్టర్' చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కాలేజ్ లెక్చరర్​గా కనిపించనున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, మాళవిక మోహనన్, ఆండ్రియా తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతమందిస్తుండగా, లోకేశ్ కనకరాజ్​ దర్శకత్వం వహిస్తున్నారు. లాక్​డౌన్​ లేకపోయింటే ఈ పాటికే థియేటర్లలోకి వచ్చి ఉండేదీ సినిమా.

vijay in master
'మాస్టర్' సినిమాలో విజయ్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.