విజయ్ దేవరకొండ... యువతలో ఈ రౌడీ హీరోకున్న క్రేజే వేరు. డేరింగ్ ప్లస్ అమాయకత్వం వంటి అరుదైన ఫీలింగ్‌తో అలరించే విజయ్ నిర్మాత అవతారమెత్తి తొలి ప్రయత్నంగా 'మీకు మాత్రమే చెప్తా' నిర్మించాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టాక్ బాగున్నా నిర్మాణ విలువలు అనుకున్నంత స్థాయిలో లేవని విమర్శలు వినిపిస్తున్నాయి.
తనను హీరోను చేసిన దర్శకుడికి ప్రతికానుకగా... తరుణ్‌భాస్కర్ కథానాయకుడిగా ఈ చిత్రాన్ని నిర్మించాడు విజయ్. షమీర్ సుల్తాన్ దర్శకుడు.
నిజానికి పెళ్లి చూపులు సమయంలోనే షమీర్.. విజయ్ దేవరకొండను హీరోగా అనుకొని ఈ కథ చెప్పాడట. అయితే 'అర్జున్ రెడ్డి' సినిమాతో బిజీగా ఉండడం వల్ల అప్పుడు చేయలేకపోయడట రౌడీ హీరో. తర్వాత 'అర్జున్ రెడ్డి' పెద్ద విజయం సాధించడం.. విజయ్‌కు స్టార్ హోదా రావడం చకచకా జరిగిపోయాయి. అయితే 'మీకుమాత్రమే చెప్తా' కథ తన స్టార్ స్టేటస్‌కు తగినది కాకపోవడం వల్ల తరుణ్‌ను హీరోగా పరిచయం చేస్తూ.. తాను నిర్మాతగా వ్యవహరించాడు విజయ్.
నిర్మించే సినిమాల్లో తాను హీరో కాకపోయినా...తన స్టార్డమ్కు తగ్గట్లుగా సినిమాలు నిర్మిస్తే బావుంటుందన్నది సోషల్ మీడియా వేదికగా అభిమానులు కోరుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: 'చూసీ చూడంగానే'.. టీజర్ చూసేశారా..!