విజయ్ - అట్లీ కాంబినేషన్‌లో తమిళంలో వచ్చిన ‘తెరి’, ‘మెర్సల్’ చిత్రాలు భారీ హిట్లుగా నిలిచాయి. అయితే తాజాగా నిర్మితమవుతున్న చిత్రంలో విజయ్... ఓ ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపించనున్నాడు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంతో ‘పీలే’, ‘లగాన్’ చిత్రాల స్థాయిలో దీన్ని తెరకెక్కిస్తున్నారు అట్లీ. ప్రస్తుతం సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రం కోసం భారీ ఫుట్‌బాల్ స్టేడియం నిర్మిస్తోంది చిత్ర బృందం.
-
Grand Football Stadium Set For #Thalapathy63 ! 🔥
— TʜʀɪʟʟᴇR ツ (@itz_Thriller2) April 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
pic.twitter.com/eiWcSzWV0Z
">Grand Football Stadium Set For #Thalapathy63 ! 🔥
— TʜʀɪʟʟᴇR ツ (@itz_Thriller2) April 8, 2019
pic.twitter.com/eiWcSzWV0ZGrand Football Stadium Set For #Thalapathy63 ! 🔥
— TʜʀɪʟʟᴇR ツ (@itz_Thriller2) April 8, 2019
pic.twitter.com/eiWcSzWV0Z
- రూ.6 కోట్ల ఖర్చుతో ఈవీపి స్టూడియోస్‌లో భారీ స్టేడియం సెట్‌ను నిర్మిస్తున్నారు. ఇందులోనే దాదాపు 50 రోజుల పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
- దాదాపు రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.
ఇందులో విజయ్‌కు జోడీగా నయనతార నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. సినిమా ఫస్ట్‌లుక్‌ను జూన్ 22న విజయ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీపావళి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.