ETV Bharat / sitara

'మాస్టర్'​ సినిమా ఓటీటీలో రిలీజ్​.. నిజమేనా! - telugu cinema news

తమిళ స్టార్ హీరో విజయ్ 'మాస్టర్'​ సినిమా ఓటీటీ ప్లాట్​ఫామ్​లో విడుదల కానున్నట్లు ఇటీవలే వార్తలు వినిపించాయి. అయితే, అవన్నీ పుకార్లని చిత్రబృందం తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లో సినిమాను థియేటర్ల ద్వారానే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది.

vijay movie master will release in theaters only
మాస్టర్​, విజయ్​
author img

By

Published : Aug 4, 2020, 9:30 PM IST

Updated : Aug 4, 2020, 9:41 PM IST

తమిళ స్టార్​ హీరో విజయ్​ నటించిన కొత్త చిత్రం 'మాస్టర్​' విడుదలపై కోలీవుడ్​ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమాను ఏప్రిల్​లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని తొలుత నిర్ణయించినా.. కరోనా లాక్​డౌన్​ కారణంగా వాయిదా పడింది. ఆగస్టు నెలలో అమెజాన్​ ప్రైమ్​లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్తగా ఆగస్టులో విడుదలకు సిద్ధమైన సినిమాలు ఇవేనంటూ ఓ లిస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యింది. ఇందులో 'మాస్టర్'​ చిత్రం కూడా ఉండటం వల్ల మరింత ఆసక్తి నెలకొంది.

vijay movie master will release in theaters only
వైరల్​గా మారిన లిస్టు ఇదే

అయితే, ఇవన్నీ అవాస్తవమని తేలిపోయింది. 'మాస్టర్'​ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయించినట్లు చిత్రబృందం తెలిపింది. వైరల్​గా మారిన ఆ లిస్టులో ఉన్నది 2016లో 'మాస్టర్'​ పేరుతో వచ్చిన కొరియన్ సినిమా అని స్పష్టం చేసింది.

'మాస్టర్​' సినిమాకు లోకేశ్​ కనగరాజ్​ దర్శకత్వం వహించగా.. అనిరుధ్​ స్వరాలు సమకూర్చాడు. ఈ చిత్రంలో విజయ్​ సేతుపతి కీలకపాత్ర పోషించాడు.

మాస్టర్​ సినిమా పోస్టర్​

ఇదీ చూడండి:జర్నలిస్ట్​ అర్నబ్​ గోస్వామిపై ఆర్జీవీ సినిమా

Last Updated : Aug 4, 2020, 9:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.