mahesh babu vs vijay devarakonda: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు-రౌడీహీరో విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పూరీజగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న సినిమా 'లైగర్'(vijaydevarkonda liger movie). ఇటీవలే అమెరికాలో ఓ కీలక షెడ్యూల్ షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడా? అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీని ఏప్రిల్ 1న విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందట. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.
కాగా, ఇప్పటికే మహేశ్‌బాబు నటించిన 'సర్కారు వారి పాట' అదే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఒకవేళ లైగర్ రిలీజ్ డేట్ పక్కా అయితే.. బాక్సాఫీస్ పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి. కాగా, లైగర్ చిత్రబృందం నిర్ణయంతో మహేశ్ సినిమా విడుదల తేదీని మళ్లీ మార్చుకుని మార్చిలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని టాక్. ఏదేమైనా దీనిపై క్లారిటీ రావాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
బ్యాంక్ రుణాల ఎగవేత నేపథ్య కథతో సర్కారు వారి పాట తెరకెక్కింది(mahesh sarkaru vaari paata movie). ఇందులో మహేశ్‌కు జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది. తమన్ సంగీతమందిస్తుండగా, పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇక, లైగర్ విషయానికొస్తే.. బాక్సింగ్ నేపథ్య కథతో రూపొందుతోంది. ఇందులో విజయ్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. అనన్యా పాండే హీరోయిన్. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
![సర్కారు వారి పాట వర్సెస్ లైగర్, sarkaru vaari paata vs liger, maheshbabu vs vijay devarkonda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13771710_vijay.jpg)
ఇదీ చూడండి: ప్రభాస్ 'రాధేశ్యామ్' సెకండ్ సాంగ్ టీజర్ వచ్చేసింది