ETV Bharat / sitara

విజయ్ దేవరకొండతో ఆ నిర్మాత రూ.100 కోట్ల డీల్? - #VD10

యువహీరో విజయ్ దేవరకొండ.. నిర్మాత కరణ్ జోహార్​తో రూ.100 కోట్ల డీల్​ కుదుర్చుకున్నాడట. ఇందులో భాగంగా అతడు తీసే పలు చిత్రాల్లో నటించనున్నాడీ కథానాయకుడు.

Vijay Deverakonda signs a whopping deal with Karan Johar?
విజయ్ దేవరకొండ
author img

By

Published : Mar 6, 2020, 9:58 AM IST

యువతరంలో ప్రస్తుతం క్రేజ్ ఉన్న టాలీవుడ్​ హీరో ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు విజయ్ దేవరకొండ. గత నాలుగు సినిమాలు అంతగా ఆకట్టుకోకపోయినా, అతడి ఆదరణ మాత్రం తగ్గట్లేదు. ఇటీవలే 'వరల్డ్ ఫేమస్ లవర్​' అంటూ వచ్చి నిరాశపరిచాడు. కానీ ఇప్పుడు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్​ జోహార్​తో భారీ డీల్​ కుదుర్చుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.

vijay devarakonda
హీరో విజయ్ దేవరకొండ

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు విజయ్. ముంబయిలో చిత్రీకరణ సాగుతోంది. చార్మి, పూరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా నిర్మాణంలో కరణ్ పాలు పంచుకున్నాడు. ఈ క్రమంలోనే విజయ్​తో దాదాపు రూ.100 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా తాను నిర్మించే లేదా దర్శకత్వం వహించే చిత్రాల్లో విజయ్ నటిస్తాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వీటిని తెరకెక్కించనున్నారు. ఇదే నిజమైతే విజయ్ పంట పండినట్లే.

ఇది చదవండి: బైక్​పై అనన్యతో విజయ్ దేవరకొండ రొమాన్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.