ETV Bharat / sitara

ట్వీట్‌తో కొత్త చిత్రంపై క్లూ ఇచ్చేశాడా! - మోహన కృష్ణ ఇంద్రగంటి తాజా వార్తలు

వరుస చిత్రాలతో జోరుమీదున్న విజయ్ దేవరకొండ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విలక్షణ చిత్రాల దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ఓ క్లూ కూడా ఇచ్చేశాడీ రౌడీహీరో.

విజయ్
విజయ్
author img

By

Published : May 12, 2020, 5:30 AM IST

'ఫైటర్‌' చిత్రంతో పాన్‌ ఇండియా స్టార్‌గా నిరూపించుకునేందుకు సెట్స్‌పై ముస్తాబవుతున్నాడు రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ఇప్పటికే 40 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇది పూర్తవడానికి మరికొంత సమయం పట్టే అవకాశముంది. ఇప్పటికే విజయ్‌ పలు ప్రాజెక్టులకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చేశాడు. పూరితో చేస్తున్న చిత్రం పూర్తయిన వెంటనే శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యనున్నాడు‌. దాని తర్వాత దిల్‌రాజు నిర్మాణంలో ఓ చిత్రానికి ఓకే చెప్పేశాడు. అయితే దర్శకుడెవరన్నది స్పష్టత ఇవ్వలేదు.

అయితే తాజాగా దేవరకొండ జన్మదినం సందర్భంగా ఓ దర్శకుడు చేసిన ట్వీట్‌ దీనిపై ఓ క్లూ ఇచ్చింది. ఇంతకీ అతడు మరెవరో కాదు విలక్షణ కథా చిత్రాల దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి.

"జన్మదిన శుభాకాంక్షలు దేవరకొండ. ఈ ఏడాది నీ నుంచి మంచి సినిమా ఇంకా రావాల్సి ఉంది. నువ్వు చేసే అద్భుతాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అంటూ రౌడీ హీరోకి తాజాగా బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపాడు ఇంద్రగంటి.

దీనికి దేవరకొండ బదులిస్తూ.. "కృతజ్ఞతలు. ఆ అద్భుతం మనిద్దరం కలిసి చెయ్యబోతున్నాం" అని ట్వీట్ చేశాడు. ఇంకేముంది రౌడీ ట్వీట్‌ కాస్త చిత్రసీమలో చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి శివ నిర్వాణ తర్వాత విజయ్‌ చేయబోయే చిత్రం ఇంద్రగంటి దర్శకత్వంలోనే అని ఈ ట్వీట్‌తో హింట్‌ దొరికినట్లయింది. లాక్‌డౌన్‌ పూర్తికాగానే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.