తన కెరీర్‌లో 'డియర్ కామ్రేడ్' మర్చిపోలేని చిత్రమన్నాడు హీరో విజయ్ దేవరకొండ. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన చిత్ర సక్సెస్‌మీట్‌లో భావోద్వేగానికి గురయ్యాడు ఈ కథానాయకుడు. ఈ సినిమాతో తన ప్రయాణాన్ని పంచుకున్నాడు.
"ఈ చిత్రం నాకు చాలా ప్రత్యేకం. సినిమా చేస్తున్న ఏడాది పాటు భావోద్వేగాలకి లోనై ఏడ్చిన సందర్భాలెన్నో. ప్రేక్షకులూ అలాంటి భావోద్వేగానికే గురయ్యారు. చూస్తున్నంతసేపూ కథలో లీనమైపోయారు. నేను చేయగలిగిందంతా చేశాను. రష్మిక చాలా బాగా నటించింది. అన్నిభాషల వారికీ నచ్చేలా తెరకెక్కించాడు దర్శకుడు భరత్. తొలి భాగం నవ్వించింది. ద్వితీయార్థం భావోద్వేగాలతో కట్టిపడేసింది. కామ్రేడ్స్ అంటే మిత్రులు, అభిమానులే. వాళ్లకు దీన్ని అంకితమిస్తున్నా. భరత్ వాళ్ల నాన్నకి అంకితమిచ్చారు. ఇలాంటి సినిమా చేసినందుకు కొంచెం గర్వంగానూ ఉంది" -విజయ్ దేవరకొండ, హీరో
ఈ కార్యక్రమంలో హీరోయిన్ రష్మిక మందణ్నతో పాటు దర్శకుడు భరత్, నిర్మాతలు, సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ తదితరులు హాజరయ్యారు.
ఇవీ చూడండి.. 'స్టేజిపై పాటలు పాడకపోవడానికి కారణం అదే'