ETV Bharat / sitara

'లైగర్'​ బీటీఎస్ స్టిల్స్​.. ఆసక్తిగా 'కిన్నెరసాని' ట్రైలర్ - రవితేజ

Vijay Devarakonda Liger: కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. విజయ్​ దేవరకొండ 'లైగర్',​ మాస్​ మహారాజ రవితేజ 'ఖిలాడి' సహా పలు సినిమాల ఆసక్తికర అప్డేట్లు ఇందులో ఉన్నాయి.

vijay devarakonda liger
khiladi telugu movie
author img

By

Published : Dec 30, 2021, 12:44 PM IST

Vijay Devarakonda Liger: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం 'లైగర్'. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. నేడు బీటీఎస్ (బిహైండ్​ ది సీన్స్​) చిత్రాలను విడుదలచేసింది చిత్రబృందం. విజయ్​కు పూరీ సన్నివేశాన్ని వివరించడం సహా తన ఔట్​పుట్​ ఎలా వచ్చిందో విజయ్ పరిశీలిస్తున్నట్లు స్టిల్స్​ ఉన్నాయి.

vijay devarakonda liger
విజయ్​కు సీన్​ వివరిస్తున్న పూరీ

ఈ సినిమాలో విజయ్​కు జోడీగా అనన్య పాండే నటిస్తోంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

vijay devarakonda liger
'లైగర్'​ విజయ్

Kinnerasani movie trailer: ఉత్కంఠగా 'కిన్నెరసాని' ట్రైలర్​..

మెగా హీరో కల్యాణ్ దేవ్​ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం' కిన్నెరసాని'(kalyan dev kinnerasami movie). క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రవీంద్రవిజయ్‌ కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా ట్రైలర్ గురువారం​ విడుదలై ఆకట్టుకుంటోంది. రమణతేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అన్షీతల్ హీరోయిన్. మహతి స్వర సాగర్​ సంగీతమందిస్తున్నారు. సినిమాను వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేయనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సెట్​లో 'ఖిలాడి'

మాస్​ మహారాజా రవితేజ నటిస్తోన్న కొత్త చిత్రం 'ఖిలాడి'. ఈ సినిమా షూటింగ్​ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సెట్​లో ఉన్న ఓ ఫొటోను విడుదల చేసింది చిత్రబృందం. పాట చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ravi teja upcoming movie
సెట్​లో 'ఖిలాడి' టీమ్​

రమేష్‌ వర్మ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి కథానాయికలు. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని 'అట్టా సూడకే' పాటను డిసెంబర్​ 31న విడుదల చేయనున్నారు.

ravi teja upcoming movie
'ఖిలాడి' సాంగ్

మారన్ స్టిల్స్​..

maaran dhanush
మాళవిక, ధనుష్

తమిళ సూపర్​స్టార్ ధనుష్, మాళవిక మోహనన్ జంటగా నటిస్తున్న చిత్రం 'మారన్'. గురువారం ఈ చిత్రంలోని కొత్త స్టిల్స్​ను విడుదల చేసింది చిత్రబృందం. కార్తిక్ నరేన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని విలన్​గా చేస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు.

maaran dhanush
'మారన్'లో ధనుష్
maaran dhanush
సెట్​లో మాళవిక

ఇదీ చూడండి: RRR Pre Release Event: ఎన్టీఆర్​ నాలో సగభాగం: రామ్ చరణ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.